అదిలాబాద్

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 5: సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్ వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా పోలీసులను ఆయన ఆదేశించారు. అలా చేయడం ద్వారా పోలీసులపై మరింత నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు.ప్రజాఫిర్యాదుల విభాగంలో అందిన ఫిర్యాదుల గురించి సంభందిత పోలీసు అధికారులతో మాట్లాడారు. వారసత్వంగా వచ్చే ఆస్థిని సమంగా పంచాలని మంచిర్యాలలో ఉంటున్న శోభారాణి ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. కాగజ్‌నగర్‌కు చెందిన నాగరాణి అనే మహిళ సైతం తన సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.

బాధిత కుటుంబానికి రూ.15లక్షల చెక్కు అందజేత
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 5: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లింగాపూర్ ఎస్సై జి.అంబేద్కర్ కుటుంబ సభ్యులకు రూ.15లక్షల విలువ గల చెక్కును సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అందజేశారు. 2015 డిసెంబర్ 6న తన స్వగ్రామం వరంగల్ జిల్లా వర్దన్నపేట నుండి భార్య, కుమారిడితో కలిసి తన వాహనంలో లింగాపూర్‌కు వస్తుండగా కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేద్కర్ మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ మృతి చెందిన ఎస్సై ఘటనపై విచారణ చేపట్టి రాష్ట్ర పోలీసు అధికారులకు నివేదిక పంపగా ఎస్సై అంబేద్కర్ భార్య జి.హారికకు వరంగల్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రాగా, ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ.15లక్షల విలువ గల చెక్కును ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలతో వాహనాలను నడుపుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సమయనుసారంగా తగిన విశ్రాంతి తీసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, కార్యాలయం అధికారులు ఆర్.్భరతి, కె.పుష్ప, ఎం.కృష్ణారెడ్డి, సిసి పోతారాజు, పోలీసు అసోసియేషన్ సభ్యుడు ఎస్‌కె తాజోద్దిన్, శివాజి చౌహన్, జైస్వాల్ కవిత, బాధిత కుటుంబ సభ్యులు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌కు చేరుకున్న ముదిరాజ్ మహాపాదయాత్ర
* మద్దతు తెలిపిన డిసిసి అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, డిసెంబర్ 5: ముదిరాజ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 2న ఆదిలాబాద్ నుండి ప్రారంభించిన మహాపాదయాత్ర సోమవారం నిర్మల్‌కు చేరుకుంది. ఈ పాదయాత్రకు డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు బిసి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్‌లు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని, దీంతో సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముదిరాజ్‌లను బిసి డి జాబితా నుండి బిసి ఎ లో చేర్చాలని డిమాండ్‌చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించి సంఘ భవన నిర్మాణం కోసం రూ.20 కోట్ల నిధులను మంజూరుచేయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సమాఖ్యను ఏర్పాటుచేసి రూ.1000 కోట్ల నిధిని కేటాయించాలన్నారు. అలాగే హరితహారంలో భాగస్వామ్యం కల్పించి పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్లను కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జి.శ్రీనివాస్, జగన్, శంకర్, వినోద్‌కుమార్, పాతర్ల హరీష్, గణేష్, చరణ్, శివయ్య, దేవెంధర్, భీమేష్ ముదిరాజ్‌లు పాల్గొన్నారు.