అదిలాబాద్

తెలంగాణ రాష్ట్రంతోనే భీంకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరమెరి, డిసెంబర్ 10: గిరిజన ఆరాధ్యదైవమైన కుమ్రం భీంకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ పురాణం సతీష్ పేర్కొన్నారు. శనివారం హట్టి బేస్‌క్యాంపునుండి జోడేఘాట్ వరకు రూ.15.70 కోట్లతో నిర్మించతలపెట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్సీ పురాణం, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ చంపాలాల్ తదితరులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మె ల్సీ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నైజాం నవాబులను ఎదురించి పోరాడినభీంకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఈక్రమంలోనే పోరుగడ్డను పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దేందు కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు. త్వరలో నే జోడేఘాట్‌లో పారాగ్లైడింగ్ ఏర్పాటు కు కృషిచేస్తామని పురాణం పేర్కొన్నా రు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో రవా ణా సౌకర్యాల మెరుగునకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ జోడేఘాట్ వరకు రోడ్డుపూరె్తైతే సందర్శకుల తాకిడి మరింత పెరుగుతుందన్నారు. జోడేఘాట్, అడ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటక కేంద్రాలు తీర్చిదిద్దుతామన్నా రు. దీంతో యువకులకు ఉద్యోగ అవకాశాలతోపాటు, పారిశ్రామికంగా వెను కబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మాచర్ల గణేష్, జడ్పీటిసిలు అబ్దుల్ కలాం, అరిగెల నాగేశ్వర రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, ఆసిఫాబాద్ సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, పార్టీ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తం నాయక్, సర్పంచ్‌లు జలపత్‌రావు, భీము, సుంగుబాయి, ఎంపిటిసిలు ఇఫ్తెకార్, రాధాబాయి, జ్ఞానేశ్వర్, ఉప సర్పంచ్ యూనుస్, నాయకులు వెంకటేష్, గిత్తె తిరుపతి, మడావి రఘునాథ్, దుందేరావు పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హట్టిబేస్ క్యాంపులోని కుమ్రం భీం విగ్రహానికి నివాళులర్పించారు.