అదిలాబాద్

ఔషధ మొక్కలపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, డిసెంబర్ 13: ఈనెల 15, 16న ఔషధ మొక్కలపై అవగాహన సదస్సు ఉట్నూరులో నిర్వహిస్తున్నామని తెలంగాణ ఔషద మొక్కల బోర్డు అధికారి రాజమల్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఔషద మొక్కల బోర్డు అధ్వర్యంలో ప్రజలకు మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఉట్నూరులోని కొమురంభీం ప్రాంగణంలో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు.
మొక్కల ప్రాధాన్యత, వాటి అవశ్యకత, వాటి వల్ల ఉపయోగం, ప్రజలు పెంచడం పట్ల ఆసక్తి వంటి తదితర అంశాలపై వివరిస్తామని అన్నారు. ప్రస్తుతం ఇతర మందులకంటే ఔషద మొక్కల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యం కాపాడుకునే విషయంలో భాగంగా వాటి గురించి వివరిస్తున్నామని అన్నారు.
ఈ అవగాహన సదస్సు రెండు రోజుల పాటు ఉంటుందని, ఈ సదస్సులో ప్రతి ఒక్కరు పాల్గొన్నట్లయితే మన పేరెట్లో ఎన్నో మొక్కలు ఉన్నాయని, ఆ మొక్కల వల్ల ఉపయోగాలు తదితర విషయాలను తెలియజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో లక్కారం సర్పంచ్ మర్సుకోల తిరుపతి, పంద్రా జయవంత్‌రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను భయపెట్టేందుకే అసత్య ప్రచారాలు
* తుమ్మిడిహెట్టి బ్యారేజితో లాభమే తప్పా నష్టం లేదు
* రైతులకు కోనప్ప భరోసా

కౌటాల, డిసెంబర్ 13: అమాయకులైన రైతులను భయాభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కొందరు పనికిమాలిన నాయకులు అసత్రాలను ప్రచారం చేస్తూ రైతులను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారని తుమ్మిడిహెట్టి ప్రాణహిత వద్ద నిర్మించే ప్రాజెక్టుతో కౌటాల మండలంలోని రైతులకు మేలే తప్పా ఎటువంటి నష్టం జరగదని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభయమిచారు. గ్రామాల్లో పర్యటనలో భాగంగా మంగళవారం వీరవెల్లి, కౌఠి, సాండ్‌గాం, పార్డిగ్రామాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరవెల్లి, పార్డీ గ్రామాల్లో రైతులు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత బ్యారేజి నిర్మాణంతో తమ ఊళ్లు మునిగిపోతాయని చెప్తున్నారని, ఇది ఎంత వరకు నిజమని , ఒకవేళ ఇదే జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోనప్ప పనికిరాని వెధవలు ఎన్నైనా మాట్లాడతారని, మీ గ్రామాలు ఏం ఢోకా లేదని , తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజితోకొన్ని పంట పొలాలు, భూములు ముంపుకు గురవడం మినహా ఏ ఒక్క గ్రామానికి, ఇంటికి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే గుండాయిపేట్‌లోరూ. 2కోట్లతో గెస్ట్‌హౌజ్, అదే విధంగా విద్యుత్‌సబ్‌ష్టేషన్‌తో పాటు కోట్లాదిరూపాయల రహదారి పనులు చేపడుతున్నానని , మీ గ్రామాలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే భవిష్యత్‌లో తాను మళ్లీ మీ ఊరికి వచ్చి ఓటే అడగనని స్పష్టం చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకనే నాయకులు గ్రామాలకు ఏ ఇబ్బంది జరగనట్లయితే గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా రైతులే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బసర్‌కార్ విశ్వనాథ్, కుమ్రం మాంతయ్య, వెంకటేశ్వర్‌రావు,తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో పర్యటన సందర్బంగా కౌఠి ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ఉపాధ్యాయులు ఇద్దరు ఉదయం 11 గంటల సమయానికి కూడా విధులకు రాకపోవడంతోఅక్కడివెళ్లి సందర్శించిన ఎమ్మెల్యే కోనప్ప విద్యావ్యవస్థ , పాఠశాలల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడు సెల్‌ఫోన్‌లో విద్యాధికారి సోమయ్యతో తాను మాట్లాడడంతో పాటు విద్యార్థులతో మాట్లాడించి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

* ఎమ్మెల్యే రేఖానాయక్
జన్నారం, డిసెంబర్ 12: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని కలమడుగు గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉందని అన్నారు. ఇక్కడి రైతులు రెండు పంటలు వేసుకునేందుకు విద్యుత్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. దీంతో ఇప్పటి నుండి రైతులకు విద్యుత్ కోతలు లేకుండా ప్రతి రోజు తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు. గత దశాబ్దకాలంగా గ్రామ రైతులు విద్యుత్ సౌకర్యం లేక పంటలు పండించుకునే వీలే లేకుండా పోయేదని, ఇప్పుడు ఆ సమస్యతో తొలగిపోయిందన్నారు. రైతుల సంక్షేమానికై ముఖ్యమంత్రి కెసి ఆర్ ఇప్పటికే ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో బీడు భూములు సస్యశామలం కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌స్కో ఎస్ ఈ చౌహన్ జయంత్‌రావు, డిఈ నాగేశ్వర్, ఏఈ మహేందర్ రెడ్డి, ఎంపిపి రాజేశ్వరి, గ్రామ సర్పంచ్ సోమక్క, నాయకులు భరత్‌కుమార్, సత్యం రైతులు పాల్గొన్నారు.
అధ్యాత్మిక చింతనతో మనస్సుకు ప్రశాంతత
* ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తలమడుగు, డిసెంబర్ 13: అధ్యాత్మిక చింతనతోనే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని బోథ్ నియోజవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం మండలంలోని లింగి గ్రామంలో గల సాయిబాబా ఆలయ 16వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్త్భివన వల్ల గ్రామాల్లో ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో విరాజిల్లుతారని అన్నారు. ప్రజల మద్య మంచి సంబంధాలు ఏర్పడి ప్రశాంతవాతావరణం నెలకొంటుందన్నారు.
ప్రతి ఒక్కరు భక్తిమార్గంలో ప్రయాణించినట్లయితే చెడు వెసనాలకు బానిసకాకుండా భగవంతుని నామస్మరణతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారని అన్నారు. ఈ సంధర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి మాట్లాడుతూ యువత చెడువెసనాలకు బానిసకాకుండా భక్తిమార్గంలో నడిచినట్లయితే వారీ జీవితాలు బంగారుబాట అవుతాయని అన్నారు. 16 సంవత్సరాలుగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం పట్ల గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, సర్పంచ్ పొచ్చన్న, ఎంపిటీసీ భీమన్న, వృద్దాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, గోవర్ధన్ రెడ్డి, బోజారెడ్డి, శ్రీదర్‌రెడ్డి, పొచ్చన్న, తోట దేవిదాస్, ప్రమోద్, శైలేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.