అదిలాబాద్

కరెన్సీ కోసం పత్తి రైతుల పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 15: కరెన్సీ కష్టాలు పత్తి రైతలను వెంటాడుతున్నాయి. పెద్ద నోట్లు రద్దైన మొదట్లో అంతగా ఇబ్బంది పడని రైతాంగం, కొద్ది రోజులుగా డబ్బుల కోసం బ్యాంకుల ఎదుటే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి సీజన్ మొదలై నెల రోజుల పైబడుతున్నా బ్యాంకు ఖాతాల నుండి విత్‌డ్రాయల్స్‌పై విధించిన పరిమితులను ఎత్తివేయక పోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నెల రోజుల క్రితం విక్రయించిన పత్తి డబ్బులు ఇప్పటికి చేతికి అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇవ్వాల్సిన బాకీలకు వడ్డీలు రెట్టింపవుతున్నాయి. ఈపరిస్థితుల్లో ఖాతాల్లో జమైన డబ్బుల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చే చాలీ చాలని రూపాయల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉంటున్నారు. దీంతో గడిచిన నాలుగైదు రోజులుగా ఎస్‌బిహెచ్ బ్యాంకు లైన్లలో అధికంగా పత్తి రైతులే కనిపించడం గమనార్హం. బ్యాంకర్లు ఇస్తున్న డబ్బులు ఎటూ సరిపోవడం లేదనే ఆవేదన చాలా మంది పత్తిరైతుల్లో వ్యక్తమవుతోంది. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విత్‌డ్రాయల్స్‌పై పరిమితి ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరే కాకుండా ఉద్యోగులు,కూలీ పనులు చేసుకునే వారికి సైతం కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. రూ. 500, 1000 కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం దురదృష్టకరమనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

పోలీస్ పహారా మధ్య ఆక్రమణల కూల్చివేత
* మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి
బెల్లంపల్లి, డిసెంబర్ 15: పట్టణంలోని బజార్ ఏరియాలో ప్రధాన రహదారి, మురికి కాల్వలపై ఉన్న ఆక్రమణలను గురువారం మున్సిపల్ అధికారులు పోలీసుల పహారా మధ్య కూల్చి వేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రధాన రహదారులకు మురికి కాల్వలపై అక్రమంగా నిర్మించిన ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. గత 20 రోజుల కిందట బెల్లంపల్లి మున్సిపాలిటీలో బజార్ ఏరియా ప్రధాన రహదారికి అనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని మున్సిపాలిటీ కమీషనర్ వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వ్యాపారస్తులు స్పందించకపోవడంతో గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి టిపిఎస్ సంపత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిలుముల శంకర్, ఆధ్వర్యంలో ప్రధాన రహదారి కాల్వలపై నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. కాల్వలపై ఉన్న వాటిని బ్లోజర్‌తో కూల్చివేసారు. ఉదయం 6గంటలకు ప్రారంభం అయిన అక్రమణల కూల్చివేత మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు ప్రధాన రహదారిపై ఉన్న కాల్వలను ఆక్రమించి నిర్మించిన భవనాల కట్టడాలు కూల్చాలని గల్లీలో రోడ్ల వెడల్పు చేపట్టవద్దని కమీషనర్‌తో గొడవకుదిగారు. బజార్ ఏరియాలో భవానీ చికెన్ సెంటర్ వద్ద ఉన్న అక్రమ కట్టడాన్ని జేసిబితో కూల్చివేస్తుండగా మాజీ మున్సిపల్ కమీషనర్ కన్నయ్య సింగ్ అక్కడికి చేరుకొని నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చడం సరైంది కాదని కమిషనర్‌తో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న 1 టౌన్ ఎస్సై గంగారాజగౌడ్ అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చచెప్పారు. కట్టడాల కూల్చివేతకు ఒక్కరోజు సమయం ఇవ్వాలని కమీషనర్‌కు విన్నవించారు. అనంతరం కృష్ణమందిర్ రోడ్డులో రోడ్ల వెడల్పు చేపడుతున్న క్రమంలో కౌన్సిలర్ రాజ్‌లాల్ యాదవ్ అక్కడికి చేరుకొని గల్లీలో అక్రమణలను కూల్చివేయడం నిలిపివేయాలని కమీషనర్‌కు విన్నవించారు. దీంతో కమిషనర్ అక్రమణలను కూల్చి వేసుకొవాలని మరో మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు వ్యాపారస్తులకు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మట్లాడుతూ రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని ఎవరైనా వ్యాపారస్తులు అటాంకం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న రోడ్డు వెడల్పుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.