అదిలాబాద్

ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 22: ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు వినియోగంపై యువత, కళాశాల విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 2017 జనవరి 25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు గావించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ అన్నారు. గురువారం రాష్ట్ర రాజధాని నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో 2017 జనవరి 25న నిర్వహిం చే 7వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో బన్వర్‌లాల్ సమీక్షించారు. ఈ సంధర్భంగా బన్వర్‌లాల్ మాట్లాడుతూ అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ఓటర్ల నమోదుల కొరకు అవసరమైన అన్ని రకాల ఫారాలు ఏర్పాటు చేయాలని, అన్ని విద్యా సంస్థలు, కళాశాల స్థాయి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, మండల స్థాయిలో రంగోళితో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించి, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపాలని అన్నారు. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువతీ యువకుల ఫోటోలను చిత్రీకరించాలని, ఓటర్ల దినోత్సవ సంధర్భంగా సంస్కృతి ప్రదర్శనలు, నూతనంగా ఓటర్ల జాబితాలో చేరిన వారితో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని, స్వచ్చంద సంస్థలు, ఎన్‌సిసి క్యాడెట్ల సహకారంతో 2,3,5కె పరుగును నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గ స్థాయి, రాష్టస్థ్రాయిలలో జూనియర్లకు, సీనియర్లకు విడి విడిగా వ్యాసరచన, పెయింటింగ్, క్వీజ్ కాంపిటేషన్ తదితర పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో జనవరి 21న పోటీలు నిర్వహించి, ప్రథమ స్థానంలో గెలుపోందిన వారి వివరాలను అదే రోజున ఫ్యాక్స్ ద్వారా హైదరాబాద్ కార్యాలయానికి పంపించాలని అన్నారు. ఈ పోటీలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారుల సమన్వయంతో జిల్లాల పరిధిలోని అన్ని పాఠశాలల, కళాశాలల ద్వారా పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులను భాగస్వాములు చేసి ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ప్రధానంగా నూతనంగా నమోదులు కాబడిన యువ ఓటర్లను పెద్ద ఎత్తున భాగస్వాములు చేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ జాతీయ ఓటర్ల వారోత్సవాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లాలోని 4500 స్వయం సహాయక బృందాలను భాగస్వాములుగా చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్, రంగోళి తదితర అంశాలలో పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో ఓటర్లుగా నమోదులు కానివారిని గుర్తించి ఓటర్ల జాబితాలో నమోదులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బనోత్ శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య, తహసీల్దార్లు వర్ణ, రాజేశ్వర్, ఎన్నికల పర్యవేక్షణాధికిరి ప్రభాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

రబీకి నీరందేలా చూడాలి
మంచిర్యాల, డిసెంబర్ 22: సాగునీటి పారుదల కాల్వలకు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో రబీ, పంట సాగుకు సాగు నీరు సరఫరాపై ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, ఎంపి డిఓ అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశం లో ఆయన మాట్లాడు తూ రబీలో చివరి ఆయకట్టు వరకు నీరందేలా యుద్ద ప్రాతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు. కడెం ప్రాజెక్ట్ కింద జిల్లాలోగూడెం ఎత్తిపోతల పథకంను కలుపుకొని 37 వేల ఎకరాలకు రబీలో సాగు నీరు అందించాల్సి వుందని అన్నారు. ప్రధాన కాల్వలతో పాటు ఉప కాల్వలలో మొక్కలు మొలచి చెత్త పేరుకుపోవడంతో చిన్నచిన్న మరమ్మత్తులకు గురి కావడం వల్ల చివరి ఆయకట్టు అయిన డి 42 డిస్ట్రిబ్యూటర్ ద్వారా సాగు నీరు అందించేందుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున గతంలో నిర్ణయించిన జనవరి 2017, 4 తేదీ నుండి సాగు నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలు అవసరమైన మేరకు అందుబాటులో ఉన్నారని వారిని ఉపయోగించుకొని ఆ పథకం నిధులతో కాల్వలోని మొక్కలను తొలగించి అవసరమైన మరమ్మత్తు పనులను చేపట్టాలని అన్నారు. ఈ నెల చివరి లోగా పనులన్ని పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని మధ్య, చిన్న తరహా సాగునీటి వనరుల ద్వారా రబీలో సాగు నీరు అందించేందుకు అవసరమైన పనులను మండల స్థాయిలో ఎంపిడి ఓ ల సారథ్యంలో తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి, ఇరిగేషన్ ఏ ఈలు సంయుక్తంగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. జనవరి 4 వరకు చివరి ఆయకట్టుకు నీరందించి మిగితా ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యే సందర్బంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి 500 మీటర్లకు ఒక్క అధికారిణి పర్యవేక్షకులుగా వీ ఆర్ ఓ, వీ ఆర్ ఏ, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోలీసులను నియమించాలని తెలిపారు. నీటి విడుదల తేదీలను గ్రామ పంచాయతీ, మండల కార్యాలయంలో ప్రదర్శించాలని సూచించారు. ఈ నెల 23న ఎంపి డి ఓ ల ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులతో సాగు నీటి పారుదలపై సమావేశాలు నిర్వహించారని ఆదేశించారు. రబీలో ఆరుతాడు పంటలను పండించుకునేలా వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యవంతులను చేయాలని అన్నారు. అలాగే కాల్వ మరమ్మత్తు పనులను సాగు నీటి విడుదలపై ప్రతి రోజు నివేధిక పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుధాకర్ రావు, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రతాప్ కుమార్, పాండురంగరావు, సి పి ఓ సత్యనారాయణ, డి ఆర్ డి ఓ వెంకట్, జిల్లా వ్యవసాయ అధికారి దాదారావు, కడెం ప్రాజెక్ట్ ఈ ఈ వెంకటేశం, డి ఈ మహ్మద్, మీరోదుద్దీన్, మీడియం ఇరిగేషన్ డి ఈ అంజనేయులు, ఎల్లంపల్లి డి ఈ పోచమల్లు, మైనర్ ఇరిగేషన్ ఈ ఈ గోపాల్‌రావు, తహసీల్దార్‌లు, ఎంపి డి ఓలు తదితరులు పాల్గొన్నారు.