అదిలాబాద్

పార్టీలకతీతంగా పట్టణాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 25: రాజకీయాలకతీతంగా పట్టణాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధవహిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 5, 8, 9, 33, 34 వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాలు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భుక్తాపూర్ కాలనీలో జరిగిన కమ్యూనిటీ భవన నిర్మాణ కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిసారించిందని, ముఖ్యంగా ఇంటింటా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. అంతేగాక షాదిముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు ముఖ్యమంత్రి నిర్ధిష్ట ప్రణాళికతో నిధులు మంజూరు చేశారని, పేదింటి వర్గాలకు ఈ పథకం ఎంతగానో మేలుచేకూరుస్తుందని అన్నారు. త్వరలోనే మరికొంత మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం తగదని, అభివృద్ధి కోసం అంరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు సైతం ఆయా వార్డుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తూ కాలనీ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆదిలాబాద్ పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాతోపాటు కమిషనర్ మంగతాయారు, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు
బెల్లంపల్లి, డిసెంబర్ 25: బెల్లంపల్లి పట్టణంలోని సిఎస్‌ఐ, షాలేము, పింతేకోస్టు, రోమన్ కేథలిక్, కల్వరి మినిస్ట్రీస్ చర్చిల్లో కిస్మస్ వేడుకులను క్రైస్తవ్ర సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు చర్చిలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పలు చర్చిల్లో కేక్‌లను కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.కల్వరి మినిస్ట్రీస్‌లో ఎమ్మెల్సీ పురాణం సతీష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ వసుంధర, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు, జడ్పిటీసీ కారుకూరి రాంచందర్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మేల్యే ఆత్రం సక్కు పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తెలిపారు. క్రిస్మస్ పండగ సందర్బంగా ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు క్రైస్తవులను పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఇంకా అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతామని పేర్కొన్నారు.