అదిలాబాద్

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జనవరి 1: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నిర్మల్‌లోన ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన ఇయర్‌క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. 2016 సంవత్సరంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మోసపూరిత హామీలనిచ్చి గద్దెనెక్కిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతోపాటు కరువు నిధులను విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రుణమాఫీ కూడా సక్రమంగా అమలుకాకపోవడంతోపాటు రుణాల రీషెడ్యూల్డ్ జరగకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని వాపోయారు. అలాగే యువత, విద్యార్థిలోకం తీవ్ర నైరాశ్యంలో ఉందన్నారు. ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత కలలు కలలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో వారు చదువులకు దూరమయ్యే పరిస్తితులు దాపురించాయని మండిపడ్డారు. కేంద్రంలోని మోడిసర్కార్ ప్రజలకు మంచిరోజులు వస్తాయని చెబుతూ పిచ్చి తుగ్లక్‌లా పెద్దనోట్లను రద్దుచేసిందని విమర్శించారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నల్లధనాన్ని వెలికితీస్తాం... ప్రతీ పేద బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు జమచేస్తామంటూ హామీలిచ్చిన మోడి 15రూపాయలు కూడా వేయలేదన్నారు. సామాన్యులు తమ ఉపాధిని వదులుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలతో కలిసి ఎండగడతామన్నారు.
చలో ఢిల్లీని విజయవంతం చేయండి.....
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దుకారణంగా దేశంలోని పేద, మద్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. నోట్ల రద్దును నిరసిస్తూ ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిందన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగే ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నుండి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి ఛైర్మెన్ తక్కల రమణరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సత్యంచంద్రకాంత్, పార్టీ పట్టణాధ్యక్షులు అయ్యన్నగారి పోశెట్టి, నాయకులు రామలింగం, సాదసుదర్శన్, సరికెల గంగన్న, మజర్, డి.ముత్యం, జొన్నల మహేష్‌లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి
పాలనలో కొత్తదనం ఉండాలి
అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి
నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, జనవరి 1: కొత్తగా ఏర్పడ్డ కుమ్రం భీం జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెల్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ ఎం.చంపాలాల్ అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అధికారుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ నూతన సంతవ్సర వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది నడుమ నూతన సంవత్సర కేక్‌ను కట్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాలనలో మార్పు చూపించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని ఆయన అధికారులకు సూచించారు. కలసి కట్టుగా పని చేస్తే కుమ్రం భీం జిల్లాను అన్ని జిల్లాల కంటే అభివృధ్ది పథంలో ముందుకు తీసుకెల్లేందుకు వీలవుతోందన్నారు. ముఖ్యంగా పత్రికా కథనాలపై ఎప్పకప్పుడు స్పందిస్తూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. పత్రికలు ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తాయన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నందున ప్రజలకు పాలనపై నమ్మకాన్ని పెంచేలా పని చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చంపాలాల్ పేర్కొన్నారు.