అదిలాబాద్

లక్ష్మిభవానీ కాలనీ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, జనవరి 1: పట్టణంలోని 23వ వార్డులో నూతనంగా నిర్మించబడిన లక్ష్మిభవానీ కాలనీని ఆదివారం ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎస్సీ సోదరులు నూతనంగా ఊరు మందమర్రి పరిసర ప్రాంగణంలో కొత్త కాలనీ నిర్మించుకోవడం జరిగిందని దానికి లక్ష్మిభవానీ కాలనీగా నామకరణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజులో పట్టణం మరింత అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయని దానికి అనుగుణంగా వౌళిక సదుపాయాలను కల్పించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ నాయకులు జే రవీందర్, ఎస్ ప్రభాకర్, ఎండీ అబ్బాస్, సూరిబాబుతో పాటు ఎస్సీ సంఘం నాయకులు గుండం రామాస్వామి, రఘు, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ టౌన్,జనవరి1: పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసి ఆర్ పలు సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో కజ్జర్ల గ్రామానికి చెందిన ప్రియాంకకు రూ.42,500 చెక్కును, ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్ కాలనీకి చెందిన దీనబంద్‌కు రూ.75వేల చెక్కులను అందజేశారు. ఈ సంధర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 368 మందికి ఒక కోటి 29 లక్షలను సిఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరి చేయడం జరిగిందన్నారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత 60 ఏళ్లల్లో చేపట్టిన అభివృద్దిని తెరాస ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించిందన్నారు. పేదలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం షాదిముబారక్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రజలు ప్రభుత్వ ఫథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీటీసీ ఇజ్జగిరి ఆశోక్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

బాలల హక్కులను పరిరక్షించేందుకు ‘ఆపరేషన్ ముస్కాన్’
* లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్

ఆదిలాబాద్, జనవరి 1: బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ ను రెస్యూ టీమ్ అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మిషన్ ఆఫ్‌ది మంత్ కార్యక్రమాల్లో భాగంగా జనవరి 1 నుండి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను అందించాలని ఆకాంక్షించారు. జిల్లాలో రెండు రెస్య్కూ టీమ్‌లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూరు డివిజన్‌లలో బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు బాల కార్మికులు, వీదిబాలలు, పారిశ్రామిక వాడల్లోని చిన్నారుల హక్కులను పరిరక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. బాలల హక్కులను కాపాడి వారిని బడిబాట పట్టించాలని, బాలల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జనవరి నెల మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేయాలని, చైల్డ్‌లైన్ అధికారులు, ఎన్జీవోలు, సిఐడి అధికారుల సహకారంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. 2016 నుండి జిల్లాలో 319 మంది బాలలను గుర్తించి వివిధ స్థాయిలలో కౌన్సిలింగ్ నిర్వహించి రక్షించామని ఎస్పీ తెలిపారు. సిసి ఎస్ డి ఎస్పీ కె.నర్సింహారెడ్డి అధ్వర్యంలో ఈ రెండు రెస్క్యూ టీమ్‌లు పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీ కె.నర్సింహారెడ్డి, ఏ.లక్ష్మీనారాయణ, డిసిపివో రాజేంద్రప్రసాద్, మారి స్వచ్చంద సంస్థ కోఅర్డినేటర్ సైదులు, ఎల్.సంగీత, జయచంద్ర, శివకుమార్, సిడబ్ల్యూసి చైర్మెన్ ఆమృత్‌రావు, సభ్యులు యాకూబ్‌బేగ్, ఎస్సై బి.సంతోష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.