అదిలాబాద్

60 ఏళ్ల ఆంధ్ర పాలన కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జనవరి 9: 60 ఏండ్ల ఆంధ్ర పాలన కాదు. 10 ఏళ్ల కే సి ఆర్ పాలన చూడారా అని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలో రూపాయలు ఒక కోటి 20 లక్షలతో బీటి రోడ్డు, నాల్గవ వార్డు రూ. 21 లక్షలతో సిసి రోడ్డు, రామాలయం ఏరియాలో రూ. 4 లక్షలతో సిసి రోడ్డు, 21 వార్డులో ఎమ్మెల్యే ఏసిడిపి నిధులతో ఆర్ ఓ మినరల్ వాటర్‌ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి ఎంపి బాల్క సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఇండ్ల పట్టాల సమస్య అని గుర్తు చేసారు. సింగరేణి అధికారులు బెల్లంపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బెల్లంపల్లి ప్రజల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రజల జోలికి వెళ్లవద్దిని సింగరేణి సి అండ్ ఎండి మాట్లాడానని తెలిపారు. ఈ విషయమై సి ఎం డి సానుకూలంగా స్పందించారన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పలు సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య మంత్రి కే సి ఆర్ చర్చించారన్నారు. 60 ఏళ్ల ఆంధ్ర పాలన కాదు. 10 ఏళ్ల కే సి ఆర్ పాలన చూడాలని టి ఆర్ ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర రాదాంతాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మెనిఫేస్టోలో లేని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు పరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునిత రాణి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు స్వరూప, సరిత, సదర్శన్ పాల్గొన్నారు.

ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పల్లెనిద్ర
* ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
ఆసిఫాబాద్, జనవరి 9: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న ఎస్పీ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆర్జీదారుల సమస్యలను విన్నారు. వారి నుండి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్లె నిద్రతో పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే ఆస్కారం ఉందన్నారు. గ్రామాల్లో బస చేసే పోలీసు అధికారులకు నేరుగా సమస్యలు వివరించేందుకు వీలుంటుందని ఎస్పీ తెలిపారు. తద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించ వచ్చన్నారు. పోలీసులంటే ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సన్‌ప్రీత్ ప్రజలకు సూచించారు. అధికారులు సైతం పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి పట్ల స్నేహపూర్వకంగా మెదిలాలన్నారు. ఈసందర్భంగా బెజ్జూర్ మండలం బారెగుడకు చెందిన మల్లయ్య అనే వ్యక్తి ముంజంపల్లి శివారులోని భూతగాదా పరిష్కరించాలని ఎస్పీని కోరారు. అలాగే పట్టణంలోని జనకాపూర్‌కు చెందిన ప్రియాంక తన సమస్యను వివరించారు.