అదిలాబాద్

విద్యార్థుల భవిష్యత్తుకోసమే ప్రమాణాలతో గురుకుల విద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 15: తెలంగాణలో ఉన్నత ప్రమాణాలతో కూడిన గురుకులాలలను వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మంత్రి జైనథ్ మండలంలోని మాంగుర్ల, గిమ్మ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సంధర్భంగా జైనథ్‌లో రూ.20 లక్షల వ్యయంతో అదనపు గదుల ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. కెజిటుపిజి ఉచిత విద్యలో భాగంగానే నాణ్యమైన ప్రమాణాలతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణ విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. 250 మైనార్టీ గురుకులాలను ప్రారంభిస్తామని, ఉన్నత విద్యకోసం ఆర్థికంగా చేయూతనందిస్తామని తెలిపారు. డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించేందుకే పాఠశాలల్లో సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు. ప్రైవేట్ పాఠశాలతో సర్కారు బడులు పోటీ పడాలని, విద్యార్థుల్లో పోటీ తత్వం పెరగాలని అన్నారు. ఈ సందర్భంగా గిమ్మలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంధర్భంగా రూ.13 లక్షలతో నిర్మించిన మాంగుర్ల గ్రామంలో పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామపంచాయతీల బలోపేతానికి అన్నివిధాల చేయూతనందిస్తామని అన్నారు. పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని, రోడ్లు, మురుగుకాలువల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు టిఎస్ ఐపాస్ ద్వారా రాయితీలు కల్పించి, వారి భవిష్యత్తు బంగారుబాట వేస్తామని, స్వయం ఉపాధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మంత్రి వెంట టిఆర్‌ఎస్ నాయకులు బోజారెడ్డి, చంద్రయ్య, లింగయ్య తదితరులు ఉన్నారు.

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్,జనవరి 15: నేడు ఎందరో మంది రక్తహీనతతో, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక మృతి చెందుతున్నారని, యువత రక్తదానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రాణదాతాలు కావాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీఆర్ చౌక్‌లోని ఊర్ద్భువన్‌లో బెస్ట్‌ఫ్రెండ్స్ సోసైటి అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా మంత్రి జోగురామన్న పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రక్తదానం చేసినట్లయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడినవారవుతారని అన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రక్తం నిల్వలు లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారని అన్నారు. అదేవిధంగా ఏజెన్సీ గ్రామాల్లో రక్తహీనతతో గిరి మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. రక్తం నిల్వలు పెంచేందుకు యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె.రాజన్న, టిఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బండారి సతీష్, పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, బెస్ట్ ప్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అజీస్, రహీంతోపాటు పలువురు యూత్ సభ్యులు పాల్గొన్నారు.