అదిలాబాద్

నివేదిక రాగానే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 16: ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లతో చట్టబద్దత కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సుదీర్ కమిటీ నివేదిక రాగానే పార్లమెంట్‌కు నివేదించి రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. సోమవారం ఆర్ అండ్‌బి అతిథి గృహం ఎదుట జరిగిన కార్యక్రమంలో షాదిముబారక్ పథకం కింద మంజూరైన 146 మంది లబ్దిదారులకు రూ.51వేల చొప్పున చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రామన్న ప్రసంగిస్తూ ముస్లీం మైనార్టీల్లో అసమానతలు తొలగించి, వారిలో ఆత్మగౌరవం నింపేందుకే బిసి పేదవర్గాలతో సమానంగా ముస్లీంకు షాదిముబారక్ చెక్కులను అందజేస్తున్నామని అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ డివిజన్‌లో షాదిముబారక్ లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు, ముఖ్యంగా మద్యదళారుల ప్రమేయం పెరిగినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. మైనార్టీ శాఖ నుండి ఈ బాధ్యతలను తప్పించి రెవెన్యూ అధికారులకు లబ్దిదారుల ఎంపిక, మంజూరి అధికారాలను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిసి కమిషన్ సిఫారసుల ద్వారా సుదీర్ కమిటీకి 12% రిజర్వేషన్ల చట్టబద్దతపై విచారణ సాగుతోందని, నివేదిక రాగానే న్యాయపరమైన చిక్కులు లేకుండా 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. పేద వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కెసిఆర్ ప్రత్యేక దృష్టిసారించి చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. ముస్లీం మైనార్టీల విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసమే రాష్ట్రంలో 250 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇది వరకే 150 మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా దారిద్రరేఖకు దిగవన ఉన్న బిసి వర్గాల్లోని పేద పెళ్ళీడు అమ్మాయిల తల్లిదండ్రుల పేరిట కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేల చెక్కులను అందజేస్తున్నామని, అర్హులైన లబ్దిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులు, మద్యదళారులపై కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిచ్చి త్వరలోనే జిప్లస్‌వన్ డబుల్‌బెడ్‌రూంలను మంజూరు చేస్తున్నామని, ఖానాపూర్ చెరువును ఆక్రమించుకొని నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా పురాతనమైన వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఖానాపూర్ చెరువును మిని ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనికి రూ.5కోట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. 400 డబుల్‌బెడ్‌రూంలను తొలివిడతలోనే నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి రంగానికి పెద్దపీట వేస్తూ పేదలకు అన్ని విధాల చేయూతనందిస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే చారిత్రాత్మకంగా నిలిచిపోతున్నాయని అన్నారు. ఈ సంధర్భంగా కళ్యాణలక్ష్మి కింద ఎస్సీ వర్గాలకు 7 చెక్కులను, బిసి లబ్దిదారులకు 5 చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.