అదిలాబాద్

రెండు గ్రామాల మధ్య రగులుతున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం,జనవరి 17: నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలంలో గల బూత్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు, దస్తురాబాద్ మండాలనికి చెందిన మత్స్యకార్మికులు గత కొద్ది నెలల నుండి రాంపూర్ సమీపంలో గల గోదావరిలో చేపలవేటకోసం చేస్తున్న వివాదాలు ఒకేసారి వేడెక్కాయి. పై రెండు గ్రామాల మత్స్యకార్మికులు రాంపూర్ గోదావరిలో తాము చేపలవేట కొనసాగిస్తామంటూ మరోపక్క తమకు హక్కు ఉన్నట్లు గొడవలు పడుతున్నారు. బూత్కూర్ పంచాయతీ పరిధిలోని రాంపూర్ సమీపంలో గల గోదావరిపై రాంపూర్ మత్స్యకారులు కొనే్నళ్లుగా చేపల వేటను కొనసాగిస్తున్నారు. వీరు కొద్దినెలల క్రితం గోదావరిలో గల చింతమడుగులో సొసైటి ఏర్పాటుచేసుకుని చేపలు పడుతున్నారు. కాగా గత కొద్ది నెలల నుండి దస్తురాబాద్‌కు చెందిన మత్స్యకారులు గోదావరిలో చేపలుపట్టడానికి తమకు కూడా హక్కు ఉందంటూ గోదావరిలో చేపలు పట్టడానికి ప్రయత్నాలు చేయడంతో రెండుగ్రామాల మత్స్యకారుల మద్య వివాదాలు ఏర్పడుతున్నాయి. రాంపూర్ గోదావరిలో మత్స్యకార్మికులు చేపలు పట్టడం, దస్తురాబాద్ వాసులు వచ్చి చేపలు పట్టడంతో రెండు గ్రామాల మద్య వివాదం నెలకొనగా మత్స్యశాఖ,రెవెన్యూశాఖ, పోలీసు శాఖ అధికారులకు ఫిర్యాదుచేయడం కూడా జరిగింది. అయినా పై సమస్య పరిష్కారం కాలేకపోయింది. ఇదే సమయంలో రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు గోదావరిలో చేపలు పట్టడానికి హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తేవడంతో రాంపూర్ గోదావరిలో గోదావరిలో చేపలు పట్టడానికి వీలుపడింది. చేపలు పట్టడానికి తమకు హక్కులు ఉన్నాయని, లైసెన్సులు కూడా ఉన్నాయని రాంపూర్ మత్స్యకారులు అంటున్నారు. కాగా మరోపక్క దస్తురాబాద్ మత్స్యకారులు గోదావరి తీర ప్రాంతంలో ఏ గ్రామమైన మత్స్యకారులకు చేపలు పట్టడానికి హక్కులు ఉంటాయని, ఈ గోదావరిలో చేపలవేట కొనసాగిస్తామంటూ గోదావరికి తరలిరావడంతో రెండు గ్రామాల మత్స్యకారుల మద్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మంగళవారం జిల్లా మత్స్యశాఖ అధికారి బాలకృష్ణ, ఖానాపూర్ సి ఐ నరేష్‌కుమార్, దస్తురాబాద్ తహసిల్దార్ కలీం, ఆర్ ఐ రవీందర్, ఎస్సై రాజు, రాంపూర్ గోదావరిని సందర్శించారు. ఈ సంరద్భంగా మత్స్యకారులకు ఉన్న హక్కులపై, ఆ ప్రాంతంపై వారు విచారణ జరిపారు. ఇరు గ్రామాల మత్స్యకారులు ఎలాంటి గొడవలు పడవద్దని వారు హితవుపలికారు. ఏది ఏమైన రెండు గ్రామాల మత్స్యకార్మికుల మద్య గోదావరిలో చేపలవేటకై తరచూ వివాదాలు ఏర్పడుతుండడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని మత్స్యకార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పై సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

బాలకార్మికులకు పునరావాసం
ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి

ఆదిలాబాద్,జనవరి 17: జిల్లాలోని వివిధ హోటళ్లు, జిన్నింగ్ మిల్లులు, ఇటుక బట్టీలు, వర్క్‌షాపుల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇంచార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు బడి బయట ఉండవద్దని, తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానులపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థపై వచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అదే విధంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తప్పిపోయిన పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని యదావిధిగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలల హక్కులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా బడి ఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండేలా చూడాలని అన్నారు. జిల్లా బాలల సంరక్షణ, శిశు సంరక్షణ శాఖ, కార్మిక శాఖ, స్వచ్చంద సంస్థలు సమన్వయంతో గ్రామ, పట్టణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అంకితభావంతో పనిచేసి బడి బయట పిల్లలు కనబడకుండా చూడాలన్నారు.