అదిలాబాద్

కెజిబివిలో ఇంటర్ కల సాకారమయ్యేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, మార్చి 27: నిరుపేద కుటుంబాల్లో బాలికల విద్యను ప్రోత్సహించేలక్ష్యంతో ఏర్పాటుచేసిన కస్తుర్బా బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదివే అవకాశాలులేనందున పదవ తరగతి పూర్తిచేసిన బాలికలు పైచదువులు చదివే ఆర్థికస్థోమత లేనందున ఇంటి పట్టునే ఉండిపోవాల్సిన పరిస్థితులు దాదాపు నెలకొన్నాయి. చదివిందే చాలనుకుంటూ విద్యార్థుల తల్లితండ్రులు కొన్నాళ్లపాటు వేచిచూసి ఆడపిల్లల భారాన్ని దించుకోవడానికి పెళ్లి పీఠలు ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండిపడే ప్రమాదం కన్పిస్తోంది. మండల కేంద్రంలో 2011లో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు బ్యాచ్‌లు పదవ తరగతి పూర్తిచేసి బయటికి వెళ్లిపోవడం జరగ్గా.. ఈ విద్యా సంవత్సరంలో 22మంది విద్యార్థినిలు టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. పదవ తరగతి పూర్తయితే పైచదువులపై కుభీర్‌లోని కెజిబివి బాలికలను ప్రశ్నించగా ప్రిన్సిపల్ మేడమ్ ఎలా చెబితే అలానే.. అని అమాయకంగా జవాబిచ్చారు. ప్రస్తుతం ఇక్కడి విద్యాలయంలో 199 మంది విద్యార్థినీలు ఉన్నారు. ప్రాథమిక దశలోనే డ్రాపౌట్లుగా మారిన బాలికలను చేరదీసి వారికి మేలైన వసతి సౌకర్యాలు కల్పించి కస్తుర్బా బాలికల విద్యాలయాల్లో విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం కెజిబివిలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. కస్తుర్బా బాలికల విద్యాలయాల్లోనే ఉంటూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే వెసులుబాటు కల్పిస్తే కళాశాల చదువులను పూర్తిచేస్తామని పలువురు బాలికలు అభిప్రాయపడుతున్నారు. కావున ఉన్నతాధికారులు తక్షణం స్పందించి కెజిబివి బాలికలకు ఇంటర్మీడియట్ చదువుల వెసులుబాటుపై ప్రభుత్వానికి నివేదికలు పంపి కల సాకారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.