అదిలాబాద్

గ్రామదర్శిని అర్జీలను పరిష్కరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ,జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వౌలిక సమస్యలు పరిష్కరించడానికి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. శుక్రవారం బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామంలో జరిగిన గ్రామదర్శినిలో జిల్లా కలెక్టర్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్‌లు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ఆర్జీలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని, ఆర్జీదారులు ఎన్నో ఆశలతో ఆర్జీలు సమర్పించుకుంటే వాటిపై నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వౌలిక సమస్యలను పరిష్కరించడానికే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాలకు వెళ్లడం జరుగుతుందని, ప్రజలు ఇచ్చే ప్రతి ఆర్జీకి జవాబుదారిగా అధికారులు వ్యవహరించాలని అన్నారు. ఆర్జీల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన కోరారు. సమస్యలపై పరిష్కారం జరినప్పుడే ప్రజలకు అధికారులు, ప్రభుత్వంపై నమ్మకం కల్గుతుందని అన్నారు. పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ మాట్లాడుతూ బయట ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామాల్లో నివసించే గిరిజనుల సమస్యలు జిల్లా అధికారుల దృష్టికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందునా అధికారులను ప్రజల వద్దకు తీసుకవచ్చి వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామదర్శిని ద్వారా అందే ఆర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని, సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కార మార్గం లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు న్యాయమైన లబ్దిదారులకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పథకాలు లబ్దిదారులకు అందినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని అన్నారు. అనేక ప్రభుత్వ పథకాలు ప్రజల వరకు వెళ్ళడం లేదన్నారు. రోడ్లు, రెవెన్యూ, తాగునీటి, విద్యుత్ సమస్యలపై ఆర్జీలు అధికంగా వస్తున్నందునా వాటికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు గ్రామంలోని విధి విధినా కాలి నడకన వెళ్ళి పరిశీలించారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డి ఎఫ్‌వో శివాల రాంబాబు, సిఈవో జితేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, జడ్పీటీసీ నారాయణ, ఆయా పార్టీలకు చెందిన అధికారులతో పాటు మండలానికి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటీసీ సభ్యులు పాల్గొన్నారు.