అదిలాబాద్

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ,జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేకంగా విద్యరంగంపై దృష్టిసారించిందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ అన్నారు. శనివారం ఇచ్చోడ మండలంలోని మల్యాల గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సంక్షేమ, వసతి గృహాలను మంజూరి చేయడమే కాకుండా నాణ్యమైన బోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగాముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. మల్యాల గ్రామంలో నిర్మించిన పాఠశాల అదనపు గదులను ఆయన ప్రారంభించారు.

రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
శ్రీరాంపూర్ రూరల్, జనవరి 21: రోడ్డు నిబంధనలపై ఆశ్రద్ద వహించవద్దని ప్రతి ఒక్కరు భద్రత నియమాలను పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే - 5 గని వద్ద లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 28వ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకోని లారీ డ్రైవర్స్, క్లీనర్స్‌కు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అతి వేగం తొందరపాటు పరధ్యానం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరు క్షేమం గా ఇంటికి వెళ్లాలంటే రోడ్డు నిబంధనలపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు వీదిన పడుతాయని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలను నడిపేటప్పుడు మద్యం సేవించరాదని తెలిపారు. డ్రైవర్లు,క్లీనర్స్ తప్పనిసరిగా ప్రధాన మంత్రి సురక్ష పథకం కింద ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకునేలా ఓనర్స్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డిసిపి జాన్ వెస్లీ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్‌లో మాట్లాడరాదని, వాహనాల ధృవ పత్రాలను తమ వెంటనే ఉంచుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదం జరిగితే క్షత గాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలని ప్రమాదంపై విచారణ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం ఉండదని, క్షత గాత్రులను ఆసుపత్రి సిబ్బంది వెంటనే అడ్మిట్ చేసుకొని పరీక్షలు నిర్వహించాలన్నారు. కేసు విచారణపై ఆసుపత్రికి ఇబ్బందులు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో లారీ ఒనర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ రక్తదానం చేసారు. తెలంగాణ సంస్కృతిక కళాకారుల బృందంతో గీతాలను ఆలాపించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీ ఎం ఎస్ డి ఎం సుభానీ, ఎస్ ఓ టూ జీ ఎం పివి సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా రీజినల్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి కిష్ణయ్య, ఏఎంవిఐ ప్రత్యూష, జిల్లా అధికారి భీష్మ, లారీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.