అదిలాబాద్

అప్రమత్తతతో ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, జనవరి 21: రోడ్డుపై అప్రమత్తతో ప్రమాదాల నివారించావచ్చునని డిటి ఓ వెంకటయ్య అన్నారు. శనివారం కేకే - 1 గని వద్ద రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లనే వాహనాల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాహన ప్రమాదాలు నివారించుటకు ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాద నివారణకు తోడ్పాడాలని ఆయన కోరారు.

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ప్రధాని
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
బెల్లంపల్లి, జనవరి 21: విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీస్తానని ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చిన నరేంద్ర మోదీ నేడు కార్పోరేట్ శక్తులకు పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తూ పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని సిపి ఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూపాయలు 500, 1000 నోట్లను రద్దు చేసి ప్రజలను మోదీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. ప్రధానిమోదీ అనుసరిస్తున్న విధానాలు కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కేంద్రంలో బిజేపి పార్టీ అదికారంలో కి వస్తే నల్ల కుబేరుల భరతం పడుతునాన్ని చెప్పిన మోదీ నేటి వరకు నల్ల కుబేరులను బయటకు తీయలేదని దుయ్యబట్టారు. జన్‌దన్ ఖాతాలలో 76 వేల కోట్లు జమా అయ్యాయని ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. పెద్ద నోట్లను రద్దు చేసి రూ. 2000 నోటును ఎందుకు విడుదల చేసారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు దళితుల సమస్యలపై నేడు హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ఎదుట ధర్నా చేబడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైన మోదీ నల్ల కుబేరుల జాబితాను విడుదల చేసి సమాన్య ప్రజలను ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో సిపి ఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, పట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్, నియోజక వర్గ కార్యదర్శి ధర్ని సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ గుండా మణిక్యం, ఏ ఐ టియూ సి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి, మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బోళం పూర్ణిమ, సహాయక కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు శ్రీ్ధర్, రత్నం రాజం, తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపి ఐ పార్టీ సీనియర్ నాయకుడు పోతుగంటి శేషగిరి రావు మృతి పార్టీకి తీరని లోటని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మృతి చెందిన శేషగిరి రావు కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. శేషగిరి రావు విద్యార్థి దశ నుంచే ఏ ఐ ఎస్ ఎఫ్ పార్టీలో పని చేసారని తెలిపారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిపి ఐ పార్టీలో పని చేస్తూ జిల్లాలో తిరుగులేని పార్టీ నాయకుడిగా ఎదిగారన్నారు. అంతేకాకుండా విశాలాంద్ర రిపో ర్టర్‌గా కూడా పని చేసారని తెలిపారు. ఆయన ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.