అదిలాబాద్

డిసెంబర్ నాటికి డబుల్ బెడ్‌రూంల నిర్మాణం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 21: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద లబ్దిదారులకు రెండు పడకల ఇండ్ల నిర్మాణం వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా అధికారులు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్‌రూం పథకం అమలుపై కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సంధర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూంల నిర్మాణం కోసం పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు బాధ్యతగా తీసుకొని నాసిరకం లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 900 డబుల్ బెడ్‌రూంలు మంజూరయ్యాయని, వీటిలో పట్టణ ప్రాంతాల్లోనే 582 గృహాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన 318 డబుల్ బెడ్‌రూంల నిర్మాణం కోసం ఇది వరకే భూసేకరణ పూర్తిచేయడం జరిగిందని, అర్హులైన వారికే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదాత్త ఆశయంతో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నందునా కాంట్రాక్టర్లు లాభ నష్టాలను బేరీజు వేయకుండా సామాజిక దృక్పతంతో నిర్మాణం కోసం ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. అధికారులు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తే వచ్చే డిసెంబర్ నాటికి అర్హులైన లబ్దిదారులు గృహప్రవేశం చేయడానికి అనువుగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ సైతం ఈవిషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జెసి కె.కృష్ణారెడ్డి, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, రహదారులు మరియు భవనాల శాఖ ఈఈ వెంకట్‌రెడ్డి, డిప్యూటి ఈఈ సురేష్, పంచాయితీ రాజ్ ఎస్‌ఈ శంకర్య, ఈఈ మారుతి, డిప్యూటి ఈఈ రవిప్రకాష్, ఇరిగేషన్ ఈ ఈ సుశీల్ తదితరులు పాల్గొన్నారు.

గొర్రెల పెంపకానికి ఆర్థిక సాయం
కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి

ఆదిలాబాద్,జనవరి 21: గొర్రెలు, మేకల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నందున, వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఆర్థికచేయూతనందిస్తూ వారి అభివృద్దికి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ అధికారులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకందారుల సంఘ సభ్యులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ గొర్రెలు, మేకలు, చేపల పెంపకందారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లాలో 47 పెంపకందారుల సంఘాలున్నాయని, అందులో 34 సంఘాలలోని 455 లబ్దిదారులకు మొదటి, రెండవ విడతల వారీగా రుణాలు మంజూరి చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులకు మేకలు, గొర్రెలు రాయితీపై అందించేందుకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో పరిశీలించేందుకు పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రభుత్వ వెటనరీ డాక్టర్, సోసైటి అధ్యక్షులు కమిటీగా ఏర్పడి ఈ నెల 30లోపు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అన్నారు.