అదిలాబాద్

ఒర్రె నీరే దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, జనవరి 22: గ్రామీణ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడంలేదు. మండలంలోని కొత్తపల్లి పరిధిలోని ఎంవికె-5 ఇంక్లయిన్‌లో దాదాపు 25 కుటుంబాలు జీవిస్తున్నాయి. స్థానికులు ప్రధానంగా కూలీ పనిచేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మండల కేంద్రానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో సింగరేణి రహదారికి పక్కనే ఎంవికె-5 ఇంక్లయిన్ గ్రామం ఉంది. మంచినీటి సరఫరా కోసం రక్షిత మంచినీటి పథకం నిర్మించిన అది అలంకార ప్రాయంగా మారడంతో నీటికికోసం నానాగోస పడుతున్నారు. గ్రామంలో నాలుగు చేతిపంపులు ఉన్నప్పటికి భూగర్భజలాలు అడుగంటడంతో చేతిపంపుల నుండి మురికి నీరు వస్తోంది. గ్రామానికి అరకిలోమీటర్ల దూరంలో ఉన్న ఒర్రెలో మహిళలు చెలిమెలతోడి కలుషితమైన నీటినే తెచ్చుకొని తాగుతున్నారు. ఈ నీళ్లు తాగడం వలన పెద్దలు, పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. వేసవిలో ఒర్రెలోని నీళ్లు ఎండిపోతుండటంతో మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే నాయకులు ఓట్ల కోసం వస్తారని, ఆ తర్వాత మా గ్రామంవైపు కనె్నత్తి చూడరని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పక్కనే గిరిజన గూడెం నుండి తాగునీటి పైపులైన్ వేసి నల్లాలు ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నరే గాని మంచినీటి శాశ్వత సమస్యను పరిష్కరించి తాగునీటీ కష్టాలు తీర్చడం లేదని మహిళలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పందించి తమ గ్రామంలోని తాగునీటి కష్టాలు తీర్చి తమకు న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
* రాష్ట్ర మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మామడ, జనవరి 22: మహిళలు అన్నిరంగాల్లో ముందుండి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర గృహ, న్యాయ, దేవాదాయాశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో 32 లక్షల నిధులతో నిర్మిస్తున్న స్ర్తి శక్తి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డిలేని రూణాలను అందిస్తుందని వెల్లడించారు. బిసి కులస్థులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సీడిపై గెదెలను, పడిపశువులను అందిస్తుందన్నారు. రైతులకు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి రక్షిత తాగు నీటిని అందించడంలో భాగంగా మిషన్ భగీరత పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. రైతులు పంటలను రక్షించుకోవడానికి పంట పోలాల చూట్టు రాత్రి సమయంలో అడవి జంతువుల బెడద రెండి పంటలను కాపాడడానికి విద్యుత్ తీగలను అమర్చుతున్నారని అన్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి రైతులు విద్యుత్ తీగలను లమర్చ వద్దని సూచించారు. గ్రామాల్లో ఉపాధి హమి పథకంలో సిసి రోడ్డులను నిర్మిస్తామని అన్నారు. 80శాతం నిధులు ఉపాధి హమి పథకం ద్వారా, మగిలిన 20శాతం నిధులు ఇతర నిధుల నుండి ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. బిడు భూములను సస్యశామంలో చెసేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ శివలింగయ్య, డిఆర్‌డివో వెంటేశ్వర్లు, డి పి వో నారాయణ, సర్పంచ్ లలిత, ఈఈ మదుసుదన్, ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకీషన్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర ఉపాధి హమీ పథకం సభ్యుడు హరీష్ కుమార్, మండల సమఖ్య అధ్యక్షురాలు భుమవ్వ, ఎంపిడివోశేఖర్, తహశీల్దార్ రామస్వామి, ఎపిఎం అరుణ, నాయకులు, రైతులు, మహిళ సంఘాల సభ్యురాలు, తదితరులు పాల్గొన్నారు.