అదిలాబాద్

విద్యుదాఘాతంతో 18 గేదెలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్ రూరల్, జనవరి 22: మండలంలోని బాదన్‌కుర్తి పరిధిలోని గోదావరి ఒడ్డున యాసంగి పంటల కోసం గోదావరి నది ఒడ్డున రైతులు ఏర్పాటుసుకున్న విద్యుత్ మోటార్ల వైర్లకు ఆదివారం 3 గంటల ప్రాంతంలో గేదెలు అటువైపు వెళ్లి విద్యుద్ఘాతానికి గురై 18 గేదెలు మృతిచెందాడు. ఒక్కొక్క గేదె విలువ 30 వేల రూపాయలు ఉంటుందని సర్పంచ్ గడ్డం మోహన్ తెలిపారు. బొడ్డన్న ఒర్రెవద్ద నాలుగు మోటార్లను రైతులు ఏర్పాటుచేసుకున్నారని, అందులో ఒక మోటారు చెడిపోగా దానిని ఒడ్డుకు చేర్చారని, మిగతామూడు మోటార్లు నడుస్తున్నాయని, గేదెలు అటువైపుగా వెళ్లినప్పుడు విద్యుత్ వైర్లు తగిలి ఆ ప్రాంతమంతా విద్యుద్ఘాతం ఏర్పడడం వల్ల 18 గేదెలు మృతిచెందాయని అన్నారు. విద్యుత్ అధికారులను వెంటనే పిలిపించగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చనిపోయినట్లయితే తమ బాధ్యత ఉంటుందికాని, గోదావరి ఒడ్డున మోటార్ల వద్ద ఏర్పాటుసుకున్న వైర్లకు తగిలి చనిపోయిన వాటికి మా బాద్యత ఉండదని తెలిపారు. ఇట్టి విషయమై ఖానాపూర్ ఎస్సై వినయ్‌కు ఫిర్యాదుచేయగా ఆయన కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు వినయ్‌కుమార్ తెలియజేశారు. ఏది ఏమైనప్పటికి రైతన్నలకు పాలిచ్చే గేదెలు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క గేదె దాదాపు 30 వేలు ఉండడంతో దీనిని ఎవరు భరిస్తారన్న ప్రశ్నార్థకంగా మారింది.

అన్ని వర్గాలకు ప్రాధాన్యత
* ఎమ్మెల్యే రేఖానాయక్
ఉట్నూరు, జనవరి 22: బంగారు తెలంగాణకు బాటలు వేయడానికి తెలంగాణలోని అన్నివర్గాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం కెసిఆర్ చిత్రపటానికి స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాలాభిషేకం చేపట్టగా ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ హిందూ ముస్లీం క్రైస్తవ వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తనదైన ముద్ర వేసుకుంటున్నారని అన్నారు. ఇటీవలే మైనార్టీల సంక్షేమం కోసం షాదిముబారక్ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్‌లోని మైనార్టీ భవన్, ఇతర కార్యక్రమాలను ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు. ఈ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి విమల రాథోడ్‌తో పాటు పలువురు మైనార్టీలు పాల్గొన్నారు.