అదిలాబాద్

కుష్టువ్యాధి నివారణకు తోడ్పాటునందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జనవరి 30: సమాజంలో కుష్టువ్యాధి నివారణకు ప్రతీ ఒకరూ తోడ్పాటునందించాలని వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి పిలుపునిచ్చారు. జాతీయ కుష్టువ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మావల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభను నిర్వహించారు. ఈ సంధర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ వర్ధంతి సంధర్భంగా రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ కుష్టువ్యాధి తీవ్రత అందరి సమష్టి కృషితో తగ్గిందన్నారు. రానున్న రోజుల్లో కుష్టువ్యాధిని సమూలంగా నివారించేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు. చర్మంపై పాలిపోయిన, రాగిరంగు గల స్వర్శలేని మచ్చలు ఎవరికైన ఉంటే దగ్గర్లోని ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. కుష్టురోగులను వివక్షకు గురిచేయవద్దని అన్నారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ శోభాపవార్ కుష్టవ్యాధి నివారణ కార్యక్రమాల గురించి వివరించారు. ఆదిలాబాద్ జడ్పీటీసీ ఇ.అశోక్ గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కళాజాత ద్వారా కుష్టువ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మావల సర్పంచ్ రఘుపతి, డిఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్ చందు, డిప్యూటి డిఎంఆండ్ హెచ్‌వో డాక్టర్ సాధన, వైద్యాధికారి విష్ణు, డిప్యూటి పారామెడికల్ అధికారి రవీందర్, మధుసూదన్‌రావు, వివి రావ్, మావల గ్రామపంచాయతీ ఈవో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్‌ది దగాకోరు పాలన
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్
భీమిని, జనవరి 30: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ జడ్పీటిసి అనంతరావు కుటుంబ సభ్యులను సోమవారం మాజీ మంత్రి, టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్ పరమార్శించారు. అనంతరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు అనంతరావు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని ప్రజల మనిషిగా గుర్తింపు పోంది మంచి నాయకుడిగా గుర్తింపు పోందారని ఆయన మృతి గ్రామ ప్రజలకు, కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను మరచి దగాకోరు పాలన సాగిస్తున్నాడని బంగారు తెలంగాణ సాధిస్తానని కల్లిబోల్లి మాటలుచెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కన్నోళ్ల కన్నీటి తెలంగాణ మార్చడని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంటూ గుత్తేదారులకు కోట్ల రూపాయలు దోచి పెడుతున్నాడని బంగారు తెలంగాణ రావాలంటే హైదరాబాద్‌లో ఏసి లకింద కూర్చుంటే రాదని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రతి వ్యక్తి అన్ని పథకాలు అందేలా చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని దీని గురించి ఆలోచించకుండా ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఫిబ్రవరి 9వ నుంచి 28 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తుల గ్రామం గ్రామాల్లో తిరుగుతూ గ్రామ సభలను నిర్వహించి ప్రభుత్వ తీరును ప్రజల దృష్టికి తేడానికి కార్యాచరణ రుపొందించినట్లు తెలిపారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకోని మంత్రి పదవులు కట్టబెట్టి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న నాయకులకు మొండి చెయ్యి చూపారని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలోకి తీసుకెళ్లి బట్టబయలు చేస్తారని టిడిపి అందుకోసం నిరంతర కృషి చేస్తుందన్నారు. ఈయన వెంట టిడిపి భీమిని మండల అద్యక్షులు గట్టు రామారావు, కనె్నపల్లి అధ్యక్షుడు జి వెంకటేశ్వర్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు జి దేవదాస్ రామారావు, టిడిపి బెల్లంపల్లి అధ్యక్షుడు సుదమల్ల వెంకటి తదితరులు ఉన్నారు.