అదిలాబాద్

వంద శాతం ఫలితాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, ఫిబ్రవరి 3: ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలోని ప్రభుత్వ ఫాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు వార్షిక ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు పేరు తేవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రఫీక్ అన్నారు. శుక్రవారం కౌటాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కస్తుర్బా విద్యార్థినిలకు సంబంధించి 195 మందికి చెందిన కాస్మోటిక్ చార్జీలు, ఇంచార్జ్ ప్రత్యేక అధికారిణి విద్యార్థులకు ఇవ్వకుండా తన అకౌంట్‌లో జమ చేస్తుందన్నా వార్తల నేపథ్యంలో జిల్లా విద్యాధికారి ఈ మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసారు. తనిఖీ సందర్బంగా ఇంచార్జ్ ప్రత్యేక అధికారి కవిత అందుబాటులో లేకుండా సెలవులో ఉండటంతో ఆకౌంటెంట్ విజయను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సంబంధించి కాస్మోటిక్ చార్జీలు విద్యార్థులకు ఇవ్వలేదని ఇంచార్జ్ ప్రత్యేక అధికారి ఖాతాలో ఉన్నాయని చెప్పడంతో తక్షణమే వీటిని విద్యార్థులకు అందేలా చూడాలని అక్రమాలకు పాల్పడిన నిర్లక్ష్యం చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం, విద్యాబోధన ఇతర విషయాలపై ఆరా తీసారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి రికార్డులన్ని తనిఖీ చేసి ఖచ్చితంగా మెరుగైన విద్య బోదన జరిగేలా చూడాలని రికార్డులన్ని మెరుగా నిర్వహించాలని ఆదేశించడంతో పాటు పదో తరగతి విద్యార్థులను పలు సబ్జెక్ట్ వారీగా ప్రశ్నించారు. ఇంగ్లీష్, గణితం, తదితర విషయాలపై ప్రశ్నించిన విద్యాధికారి పాఠశాలలో జరుగుతున్న విద్యాబోధన విద్యార్థుల స్థాయిని పరిశీలించి మాట్లాడుతూ పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమిలేదని తరగతి గదిలోని విషయాలను ఖచ్చితంగా నేర్చుకోని ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తనకు తానే పోటీగా చదివినప్పుడే ఉత్తీర్ణత సాధ్యపడుతుందని హితబోధ చేసారు. ఈ సందర్బంగా ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ ఎం ఉదయ్‌బాబు పరీక్షల విధానం పరీక్షలు సందర్బంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సందేహాల నివృత్తి కోసం తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై ఈ సందర్భంగా డిఈవో రఫీక్ విద్యాధికారి సోమయ్యను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే తొలిసారిగా మండలానికి వచ్చిన డిఈవో రఫీక్, ఎంఈవో సోమయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హన్మంతు, సిబ్బంది ఉన్నారు.

‘సరస్వతి’ కింద ముమ్మరంగా వరినాట్లు
* ఎస్సారెస్పీలో పుష్కలంగా నీరు
* ఆనందంలో ఆయకట్టు రైతులు
నిర్మల్, ఫిబ్రవరి 3: నిర్మల్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానకాలువ అయిన సరస్వతి కాలువ కింద రైతులు రబీ సీజన్‌లో ముమ్మరంగా వరినాట్లను వేస్తున్నారు. ఇప్పటికే రబీ పంటల కోసం వ్యవసాయశాఖ అధికారులు అన్ని మండలాల్లోని సింగిల్ విండో కేంద్రాల ద్వారా వరివిత్తనాలను పంపిణి చేశారు. ఆయా గ్రామాల్లోని రైతులు వరి నారుమళ్లను సిద్ధం చేసి చాలా చోట్ల వరి నాట్లను కూడా పూర్తిచేశారు. ఈయేడు వర్షాకాలంలో భారీ వర్షాలు కురియడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్తాయిలో నిండింది. రబీ పంటల కోసం ప్రాజెక్టు ప్రధానకాలువలైన కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా 15 రోజుల క్రితమే నీటిని విడుదల చేశారు. సరస్వతి కాలువకు ఆన్ ఆఫ్ పద్దతిన 9 రోజులు నీటిని నిరాటంకంగా విడుదలచేస్తూ 6 రోజులు నిలుపుదల చేస్తూ నీటిని వదులుతున్నారు. విలువైన సాగునీరు వృధాకాకుండా చివరి ఆయకట్టు వరకు నీరందాలనే ఉద్దేశంతో ఈ పద్దతిని అవలంభిస్తున్నారు. ప్రతీరోజు ఈ కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 15 వరకు ఈ నీటి విడుదల కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సరస్వతి కాలువ కింద నిర్మల్, లక్ష్మణచాంద, మామడ మండలాల్లోని దాదాపు 5 వేల ఎకరాల్లో ఈ రబీ సీజన్‌లో వరిపంట పూర్తిస్థాయిలో సాగుకు నోచుకోనుంది. అంతేకాకుండా నిర్మల్ వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని నిర్మల్, దిలావర్‌పూర్, లక్ష్మణచాంద,మామడ, సారంగాపూర్ మండలాల్లోని చెరువులు, కుంటలు, స్వర్ణ ప్రాజెక్టు నీటి ద్వారా మరో 10 వేల ఎకరాల్లో వరిపంట వేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. దాదాపు 70 శాతం వరకు వరినాట్లు కూడా పూర్తయ్యాయి. గత రబీ సీజన్‌కంటే ఈ సీజన్‌లో 40శాతం మేర అధికంగా సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా బోరుబావులు, చెరువుల కింద తొందరంగా వరినాట్లను పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. పంట దిగుబడి వచ్చే సమయం ఆలస్యమైతే వేసవిలో వడగళ్ల వానలభారినపడి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. ఏది ఏమైనా గత మూడు నాలుగేళ్ల తర్వాత ఎస్సారెస్పీలో పూర్తిస్థాయిలో నీరుండడంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రబీ పంటలు పూర్తిస్థాయిలో చేతికొస్తే అప్పుల నుండి బయటపడుతామని అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.