అదిలాబాద్

ఆసుపత్రుల్లో మెరుగైన సేవలుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, మార్చి 31: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వార్డులు కలియతిరిగి అక్కడ నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం జెసి దృష్టికి రావడంతో త్వరలోనే పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆసుపత్రులకు వచ్చేది పేద ప్రజలే కాబట్టి వారికి స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించకుండా పేదల పట్ల జాలిచూపాలని తెలిపారు. వేసవి రోజు రోజుకు ముదురుతున్న దృష్ట్యా రోగులు పెరిగే అవకాశం ఉందని, రోగులకు అవసరమైన సేవలను తక్షణమే అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీరివెంట తహశీల్దార్ వెంకటరమణ, ఆర్‌ఐ ఈశ్వర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ కాశీనాథ్, పిల్లల వైద్యులు అనిల్, సురేందర్, తదితరులు ఉన్నారు.