అదిలాబాద్

ఉమ్మడి జిల్లాల్లో వేగిరంగా రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 10: అర్హులైన పేదలందరికి రెండు పడకల గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని, ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఈ ఫిబ్రవరిలోనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన ఆదిలాబాద్‌లో జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, విఠల్ రెడ్డి, రేఖానాయక్, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ ఇల్లంబర్తి, మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 ఎజెండా అంశాలలో 9శాఖల పనితీరుపై చర్చ జరగగా సభ్యులు ప్రధానంగా తాగునీటి సమస్య, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, హరితహారం, డబుల్‌బెడ్‌రూం పథకాల గురించి సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాటర్‌గ్రిడ్ పథకం అమలుతీరుపై జరిగిన సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో నత్తనడకన సాగుతున్న పనులపై అసహనం వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్‌లోగా 3,625 ఆవాస గ్రామాలకు తాగునీటిని అందిస్తామని అధికారులు సమాధానం ఇవ్వగా ఈ పథకం తీరు చూస్తూంటే గడవులోగా పూర్తికావడం అనుమానమేనని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత డిసెంబర్ నాటికే వంద గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటివరకు వాటిని పూర్తిచేయలేకపోయారని, ముఖ్యంగా ఇంటెక్‌వెల్, ఫిల్టర్‌బెడ్‌ల నిర్మాణం కూడా పూర్తికాకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శమన్నారు. నిర్మల్ జిల్లాలో 33గ్రామాలకు మార్చిలోగా తాగునీరు అందిస్తామని అధికారులు వివరించగా పనులు వేగవంతం చేసి డిసెంబర్‌లోగా ఎలాగైనా ఇంటింటికి తాగునీరు అందించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. డబుల్‌బెడ్‌రూం నిర్మాణంపై సందిగ్ధతకు తెరదించి అన్ని నియోజకవర్గాల్లో ఫిబ్రవరిలోగా పనులు పూర్తిచేయాలని, ముందుగా ప్రభుత్వ భూముల్లోనే ఈ పథకం నిర్మాణం చేపట్టాలని, సిమెంట్‌ధర రాష్టవ్య్రాప్తంగా రూ.230 చొప్పున కొనుగోలు చేసేలా అంగీకారం కుదిరిందన్నారు. ఇసుక లభ్యత లేనిచోట ఇతర జిల్లాల నుండి తెప్పించేందుకు అనుమతులు జారీచేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తాగునీటి సమస్యపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో నీటి కొరత లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని, వచ్చే వేసవికల్లా మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి గ్రామాల్లో సమస్యలు తీర్చేందుకు సిఆర్‌ఎఫ్ ఫండ్ కింద రూ.19కోట్లతో ప్రతిపాదనలు నివేదించడం జరిగిందన్నారు. సిఎంతో మాట్లాడి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు నీటిఎద్దడి నివారణకు నిధులు రాబడుతామని హామీ ఇచ్చారు. హరితహారంపై జరిగిన చర్చలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఈ ఏడాది భారీ ఎత్తున మొక్కల పెంపకానికి ప్రణాళికలు రూపొందించామని, నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. అడవుల్లో ఫలాలనిచ్చే మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల్లో హరితకమిటీలు వేసి వారి సారథ్యంలోనే మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలు కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. అయితే అడవుల్లో కోతుల బెడద ఉన్నందునా గ్రామాల్లోనే ఫలాలనిచ్చే మొక్కలను పెంచాలని కొందరూ సభ్యులు కోరగా కోతులను పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, డబ్బుల కొరతలేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొర్రెల పెంపకం కోసం యాదవుల సంక్షేమానికి 75శాతం రాయితీతో రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతి లబ్దిదారునికి ఈ పథకం అందుబాటులోకి తీసుకరావాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 353 చెరువుల్లో రెండు కోట్ల 70లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందని, మత్స్యకారుల అభివృద్ధికి అన్నివిధాల చేయూతనందిస్తామన్నారు. బజార్‌హత్నూర్ జడ్పీటీసీ నారాయణ మాట్లాడుతూ కందుల కొనుగోళ్లలో అధికారులు వివక్ష చూపుతున్నారని, వ్యాపారుల నుండి తేమ శాతం లేకుండానే ఇష్టారాజ్యాంగా కొనుగోలు చేస్తూ రైతులకు మాత్రం కొర్రీలు పెడుతున్నారని, దీంతో మార్కెట్‌లో రైతులు దగా పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రైవేట్ మార్కెట్‌లో కొనుగోలు జరిగితే రైతులు నష్టపోతారని, ముఖ్యంగా జాప్రాపూర్ అనే గ్రామంలో 2కోట్ల విలువైన ధాన్యాన్ని ఓ బడా వ్యాపారికి విక్రయించగా డబ్బులు చెల్లించకుండానే ఉడాయించాడని, ఇంతవరకు ఆయన సమాచారం లేకుండా పోయిందన్నారు. నిర్మల్ మార్కెట్‌లో ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు చేపట్టిన్నట్లు ఏడి శ్రీనివాస్ తెలిపారు. దండేపల్లి మండలంలోని హైస్కూల్ శిథిలావస్థలో ఉందని, ఈ పాఠశాలను కొత్త భవనంలోకి మార్చాలని ఆ మండల జడ్పీటీసీ విన్నవిస్తూ, అధికారులు పట్టించుకోవడంలేదనడంతో మంత్రి ఐకెరెడ్డి స్పందిస్తూ వెంటనే ఈ నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ సిబిఎఫ్ ఫండ్ కింద నిర్మాణంలో ఉన్న భవనాన్ని పూర్తిచేసి పాఠశాలను ఉన్నతీకరిస్తామని హామీ ఇచ్చారు. జైపూర్ మండలంలో ఎక్సైజ్ అధికారులు గుడుంబా నియంత్రణ పేరిట సామాన్యుల ఇండ్లలోకి చొరబడి కేసులు నమోదు చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంటాల జడ్పీటీసీ మాట్లాడుతూ తమ మండలంలోని అంబుగాం తాండాలో కొనే్నళ్లుగా తాగునీటి సమస్య వేదిస్తోందని, జిల్లా కలెక్టర్ ఇల్లంబర్తి ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ఊరికి తాగునీరందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ఈ బడ్జెట్‌లో రైల్వేలైన్ మంజూరు కావడం, ఉమ్మడి జిల్లాలో 174 ఎఈవో పోస్టులు భర్తీకావడం వెనుక ముఖ్యమంత్రి కృషి దాగి ఉందని, ఈ సందర్భంగా సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ జడ్పీలో తీర్మానం ప్రవేశపెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపిపిలు, ఎంపిటీసీలు, నాలుగు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.