అదిలాబాద్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 10: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలక్‌మందిర్)లో రూ.42లక్షల 35వేలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యావిధానాన్ని అందించడంతో పాటు వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు సైతం కష్టపడి మంచి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, అందుకుగాను ప్రణాళికబద్దంగా విద్యార్థులను చదువుల్లో ముందుంచాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి కెజి టు పిజి ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతో పాటు పోస్టులు భర్తీచేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె.రాజన్న, డిఈవో లింగయ్య, మావల సర్పంచ్ రఘుపతి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, కౌన్సిలర్లు సత్యనారాయణ, పాఠశాల ప్రదానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాసర క్షేత్రంలో వేద పాఠశాలను ఏర్పాటుచేయాలి
బాసర, ఫిబ్రవరి 10: బాసర పుణ్యక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేద పాఠశాలను ఏర్పాటుచేయాలని సాంస్కృతిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నాగబాల సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం బాసర సరస్వతిదేవిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని వేములవాడ అథితి గృహంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ నాలుగు జిల్లాలుగా విభజించడం సంతోషకరమని పేర్కొన్నారు. కళారంగంలో జిల్లా విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. బాసర క్షేత్రంలో వ్యాసమునిచే ప్రతిష్టించబడిన బాసర క్షేత్రంలో వేద పాఠశాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వేదాలకు నిలయమైన ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్దిచెందిందని, వేద పాఠశాలను ఏర్పాటుచేస్తే మరెంతో మంది ఆధ్యాత్మికవేత్తలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాసర క్షేత్రంలో నిర్మల్ జిల్లా సాంస్కృతిక సమైక్యను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. 34 సంవత్సరాల గొప్ప చరిత్ర గలిగిన ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమైక్యతో అదనంగా నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎందరెందరో కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. బుల్లితెర, వెండితెరలో తమ ప్రతిభాపాఠవాలను ప్రదర్శిస్తున్నారన్నారు. సాంస్కృతికరంగ ప్రముఖులను ఈ కార్యవర్గంలో చోటు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అప్పాల చక్రధారి, తుమ్మల దేవరావు, గోపాలకృష్ణ, కృష్ణంరాజు, మదన్‌దీక్షిత్, తదితరులు పాల్గొన్నారు.