అదిలాబాద్

పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 10: పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి అన్నారు. పట్టణంలోని రెండో వార్డు గ్రౌండ్‌బస్తీలో ప్లాన్ ఎంఐఆర్ 2010-11 సంవత్సరం 6లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, కల్వర్టు నిర్మాణ పనులను సునీతరాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ మున్సిపాలిటీ అభివృద్ధికోసం కోట్లాది రూపాయలను విడుదల చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ రెండు సంవత్సరాలలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కంటే అన్నివిధాల అభివృద్ధి పరుస్తామని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, డిఈ రమేష్ కుమార్, ఎఈ సందీప్, కౌన్సిలర్ ఆరేపల్లి సుధారాణి, ఎలిగెట్టి శ్రీనివాస్, నాయకులు పసుల మహేష్, వేణు, కాంట్రాక్టర్ పద్మారెడ్డి తదితరులుపాల్గొన్నారు.

మల్లన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు
* మహిళల సాముహిక సత్యనారాయణ వ్రతాలు
* భారీగా తరలివచ్చిన భక్తులు
ముధోల్, ఫిబ్రవరి 10: గ్రామీణ ప్రజల అరాధ్యదైవమైన మల్లన్న దర్శనానికి భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం మల్లన్న జాతర ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలు సాముహిక సత్యనారాయణ వ్రత పూజలు చేశారు. ఐదురోజులపాటు కొనసాగే మల్లన్న దేవుని జాతర ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా పక్కరాష్టమ్రైన మహరాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మల్లన్న దేవునికి మహిళలు బోనాలతో తరలి వచ్చి సాముహిక సత్యనారాయణ పూజలు చేశారు. భక్తిశ్రద్దలతో మల్లన్నకు పూజలుచేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. సుదూర ప్రాంతం నుండి వచ్చే భక్తుల కొరకు భైంసా ఆర్టీసీ ఆధికారులు భైంసా నుండి ఎడ్‌బిడ్ గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నారు. రాత్రి సమయాల్లో మల్లన్నదేవుని ఆలయ పరిసర ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మల్లన్న జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో గ్రామభివృద్ది కమిటీ అధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగా కుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో ఎడ్‌బిడ్ గ్రామానికి తరలి రావడంతో గ్రామంలో సందడి నెలకొంది.

కన్నుల పండువగా సమ్మక్క సారలమ్మ జాతర
* భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
ముధోల్, ఫిబ్రవరి 10: గిరిజనుల అరాధ్యదైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు భారీ సంఖ్యలో గిరిజనులు తరలి వచ్చారు. ముధోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్‌బిడ్ తండాలో ఐదు రోజు నుండి జరుగుతున్న జాతర ఉత్సవాలను నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన భక్తులు భారీసంఖ్యలో వచ్చి అమ్మవారికి బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గత రెండు రోజుల నుండి జరుగుతున్న ఉత్సవాలు ముగింపు రోజు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి గద్దె వద్దకు చేరుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
* చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
మంచిర్యాల, ఫిబ్రవరి 10: చిన్నారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అధిక శాతం ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్ పర్సన్ వసుంధర జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి భీష్మా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు నులి పురుగు సక్రమణ నివారణ అవగాహన కల్పించి మాత్రలు పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నులి పురుగు నివారణ మాత్రలకు చిన్న పిల్లలో వేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. చిన్నారులు మట్టిలో ఆడుకోవడం, చేతులను శుభ్రం చేసుకోకుండా ఆహారం భుజించడం వల్ల నులి పురుగులు శరీరంలోకి వెళ్లి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయని అన్నారు. చిన్నతనంనుంచే పిల్లలు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 2 లక్షల 28 వేల 513 మంది ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరందరికి 3 లక్షల 70 వేల మాత్రలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు కళాశాలలో, అంగన్‌వాడి కేంద్రాలలో పంపిణి చేసినట్లుగా తెలిపారు. ఈనెల 11 నుంచి 14 వరకు ఆశాకార్యకర్తలు 1 నుంచి 5 సంవత్సరలోపు పిల్లలను గుర్తించి 15న మందులు పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే పౌష్టికాహారంను అందించడంతో పాటు వ్యిక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో పిల్లల తల్లిదండ్రులు పరిశుభ్రత పై విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ హెల్త్ ప్రోగ్రాం అధికారి ఫయాజ్‌ఖాన్, జాతీయ నులిపురుగు నివారణ జిల్లా అధికారి అతీఫ్‌పాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, తదితరులు పాల్గొన్నారు.