అదిలాబాద్

ఆకుపచ్చ తెలంగాణ కోసం కెసిఆర్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 12: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలలో ఆకుపచ్చ తెలంగాణ గా మార్చడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసారు. ఆదివారం పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ గురుకులాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 119 బిసి గురుకులాలను మంజూరు చేశారన్నానరు. రాష్ట్రం ఏర్పడితన రెండున్నర సంవత్సరాల కాలంలో రైతులకు నీరు, కరెంటు అదే విధంగా అన్ని విధాల కష్టపడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోలేదని తమ ప్రభుత్వం విద్యార్థులకోసం పాఠశాలలు, కళాశాలలు హాస్టల్స్, జూనియర్, డిగ్రీ కళాశాలలో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. మైనార్టీ పేద బడుగు, బలహీనవర్గాల ప్రజల చేతివృత్తులకోసం ఈ బడ్జెట్‌లో కెసిఆర్ ఓ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. అంతేకాకుండా 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో కెసిఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం మార్కెట్ యాడ్‌లను అభివృద్ధి చేసి వారు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన బెల్లంపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని పట్టణంలోని సింగరేణి బొగ్గు గనులు మూతపడ్డాయన్నారు. బెల్లంపల్లిలో దాదాపు 50 సంవత్సరాలుగా ప్రజలు స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోని జీవిస్తున్నారని వారికి ఇళ్ల పట్టాలకోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే చిన్నయ్య సమాక్షంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి తలసానిని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు యాదవులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి, ఎంపిపి పొట్లపల్లి సుభాష్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలువేరు నర్సింగం, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్, కౌన్సిలర్లు పత్తిపాక రాజ్‌కుమార్, బత్తుల సుదర్శన్, ఎలిగేట్టి శ్రీనివాస్, చిట్యాల మధు, భూపల్లి రాజేశ్వర్, మాజీ ఆప్‌కో చైర్మన్ గడ్డం జగన్నాధం, తాండూర్ జడ్పీటిసి సురేష్ బాబు, నాయకులు రమేష్, భీమాగౌడ్, గెల్లి రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

బాలికల డబుల్స్‌లో తమిళనాడు జయకేతనం
* బాలురు విభాగంలో తమిళనాడు
* బాలికల్లో కర్ణాటక విజయం
తాండూర్, ఫిబ్రవరి 12: గోలేటి టౌన్‌షిప్‌లో నాలుగు రోజులపాటు నిర్వహించిన 62వ జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ జూనియర్స్ బాలబాలికల పోటీలు ఆదివారం ముగిసాయి. ఈ సందర్భంగా బాలికల విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు కేరళపై, బాలుర విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఆంధ్రప్రదేశ్‌పై విజయం సాధించింది. డబుల్ విభాగంలో తమిళనాడు జట్టు కర్ణాటకపై, బాలుర డబుల్ విభాగంలో తమిళనాడు జట్టు ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందాయి. ఫైనల్ మ్యాచ్ పోటీలు జట్ల మధ్య పోటీ ఆధ్యంతం అసక్తికరంగా సాగాయి. ఇరు జట్ల క్రీడాకారులు తమ ఆట నైపుణ్యం పాటించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అంతకు ముందు వారు క్రీడాకారులనుద్ధేశించి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు సిఎం కెసిఆర్ పెద్దపీట వేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నరన్నారు. క్రీడల్లో క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి తమ రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. మారుమూల గ్రామమైనా గోలేటిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బిబిఎఫ్‌ఐ ప్రతినిధులు వై.రాంబాబు, రామకృష్ణారావు, గొంగడే, సుకన్‌దాస్, శ్రీనివాస్‌రావు, రవీందర్, విజయ్‌ప్రసాద్‌రెడ్డి, రాజయ్య, దుర్గయ్య, ఆర్.నారాయణరెడ్డి, ఎస్.తిరుపతి, జిఎం రవిశంకర్, ఎస్వోటు జిఎం కొండయ్య, ఎంపిపి కార్నధం సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ అజ్మీర బాబురావు, సర్పంచులు, ఎంపిటిసిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అణగారినవర్గాల అభివృద్ధే లక్ష్యం
* విద్యతోనే యాదవుల ప్రగతి
* గొర్రెల సబ్సిడీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
* మంత్రి తలసాని
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12: అణగారినవర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని, ఇందులో భాగంగానే కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం తరపున చేయూత నిచ్చేపథకాలను పకడ్బందీగా అమలు చేసే చర్యలు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం కుమ్రంభీం జిల్లాకేంద్రంలో నిర్వహించిన యాదవ శంఖారావంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తలసాని మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలకు చెందిన గొల్లకుర్మలు, యాదవులు వేలసంఖ్యలో హాజరైన ఈ శంఖారావంలో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి గొడం నగేష్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, రాజయ్య యాదవ్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు యాదవ్, రాష్టన్రాయకుడు జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్, గంగపుత్రులు, యాదవులు, గొల్లకుర్మలు, గౌడ కులస్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పాడి, పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న యాదవులు, గొల్లకుర్మలు అక్షరాస్యత సాధించాలన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉందనే సత్యాన్ని గ్రహించాలని ఆయన యాదవులను కోరారు. యాదవులు, గొల్లకుర్మలకు చేయూత నిచ్చేందుకు ముఖ్యమంత్రి 75శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసే పథకాన్ని ప్రవేశ పెట్టాడ న్నారు. గ్రామాల్లోని పశువులకు ఉచిత వైద్యం అందించేందుకు డాక్టర్లతో కూడిన వంద సంచార వైద్యశాలను ఏర్పాటు చేశామన్నారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నా రు. గత ప్రభుత్వాలు గొర్రెల కాపరుల కోసం ప్రవేశ పెట్టిన ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని రూ.లక్ష నుండి రూ.6 లక్షల వరకు పెంచిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

కార్మిక చట్టాలను సవరించి వారసత్వం సాధిస్తాం
* నూతన భూగర్భ గనులకు కృషి చేస్తా
* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్
శ్రీరాంపూర్ రూరల్, ఫిబ్రవరి 12: కార్మిక చట్టాలను సవరించి వారసత్వ ఉద్యోగాలను సాధిస్తామని ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ముందుగా టిబిజికెఎస్, టిఆర్ ఎస్ నాయకులు యూనియన్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వారసత్వ ఉద్యోగాలకై సిఎం కెసిఆర్ నిర్ధిష్టమైన ప్రణాళికతో ఉన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, కార్మికుల పట్ల కెసిఆర్‌కు అమితమైన ప్రేమ ఉందన్నారు. చట్టాలను సవరించి అయిన వారసత్వ ఉద్యోగాలను సాధించి తీరుతామన్నారు. రెండున్నరేళ్లలో 60వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రభుత్వంలో ఐటి పాస్ ద్వారా 3 వేల కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల లక్షా 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. రామగుండం, ఎన్టీపిసిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటు లోకి రానుందన్నారు. టిబిజికెఎస్ అధ్యక్షుడు బి వెంకటరావు మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలను పతిపక్ష సంఘాలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని తాము ముందే చెప్పామన్నారు. కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి కాశీరావు, మల్లారెడ్డి, బంటు సారయ్య, జడ్పీటిసి రాచకొండ ఆశాలత వెంకటేశ్వర్లు, ఎంపిపి బేర సత్యనారాయణ, సర్పంచ్ వేల్పుల రాజేశం, జడ్పీటిసి సుధారాణి, ఎన్నికల కమిటీ సభ్యులు వీరబద్రి, మైపాల్ రెడ్డి, మోతే రాఘవరెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కార్యదర్శి సిహెచ్ అశోక్, బండి రమేష్, పానుగంటి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

వడ్డెర్లను డినోటిఫైడ్ ట్రైబ్స్‌లో చేర్చాలి
* వడ్డెర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాములు
నిర్మల్, ఫిబ్రవరి 12: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి న వడ్డెర్లను బిసి ఎ గ్రూపు నుండి తొలగించి డినోటిఫైడ్ ట్రైబ్స్‌లో చేర్చాలని దీంతోనే వడ్డెర కులస్తులకు న్యాయం జరుగుతుందని వడ్డెర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ జె.రాములు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వడ్డెర్ల లక్ష్యసాధన మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెర్లకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక ఎకరం స్థలం మంజూరుచేసి భవన నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లో 10ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి 10 కోట్లు మంజూరుచేయాలని డిమాండ్‌చేశారు. ప్రతీ మండల కేంద్రంలో వడ్డెర్లకు 5 ఎకరాల క్వారీపట్టా లీజీకివ్వాలన్నారు. రాష్ట్ర వడ్డెర్ల కో ఆపరేటివ్ సొసైటీలకు 50లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. వడ్డెర్లకు అటవీ ఏరియాల్లో క్వారీల్లో అనుమతించాలన్నారు. స్వతహాగా వడ్డెర్లు కష్టజీవులని, లక్ష్యసాధనలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. వడ్డెర మహిళలకు 5లక్షల రుణాలను ఇవ్వాలన్నారు. ఈనెల 20న ముఖ్యమంత్రి దృష్టికి పెద్దఎత్తున తరలివెళ్లి సమస్యలు విన్నవిస్తామన్నారు. ఈ సందర్భంగా రాములును సత్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తిరుపతయ్య, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి వెంకయ్య దిష్టిబొమ్మ దగ్ధం
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 12: ఎస్సీల మనోభావాలను దెబ్బతీయడానికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అనడం సరికాదని, ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు మెట్టు ప్రహ్లాద్ అన్నారు. ఆదివారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ దళితుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వెంకయ్యనాయుడు మాట్లాడడం సమంజసం కాదని, ఎస్సీ వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. వర్గీకరణ చేసినట్లయితే మరింత వెనకబడే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భగవండ్లు, దేవిదాస్, రమేష్, స్వామి, రాజేశ్వర్, గంగయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఉపముఖ్యమంత్రిని కలిసిన ట్రిపుల్ ఐటి ఉద్యోగులు
బాసర, ఫిబ్రవరి 12: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటిలోని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటిల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమ్మె పిలుపుమేరకు గత మూడు రోజులుగా సమ్మెను నిర్వహించడంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు ఆహ్వానించిందని బాసర ట్రిపుల్ ఐటి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ యూనియన్ నాయకులు ఎన్.సుధాకర్ పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ చర్చలు జరిపినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి డిమాండ్ల సాధనకు కృషిచేస్తామని ఉపముఖ్యమంత్రి హామీనిచ్చినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున త్వరలోనే యూనివర్సిటి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై కమిటిని వేయనున్నట్లు వారు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటిల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమ్మె వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రిని కలిసిన వారిలో డాక్టర్ విజయ్‌కుమార్, మధుసుదన్‌రెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఒంటరి మహిళలకు అండగా ప్రభుత్వం
* రాష్ట్ర మంత్రులు ఐకె రెడ్డి, జోగు రామన్న
కుంటాల, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ఒంటరి జీవనం గడిపే మహిళలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉండి వారి కుటుంబాలను ఆదుకుంటుందని దేవాదాయశాఖ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బిసి సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పార్లమెంటు సభ్యులు నాగేష్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని అంబకంటి గ్రామంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు నూతనంగా నిర్మించిన సంఘ భవనాన్ని వారు ప్రారంభించారు. గ్రామంలో డ్రైవనేజీ, రోడ్లపరిస్థితి బాగాలేదని గ్రామస్థులు మంత్రుల దృష్టికి తెచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్టల్రో ఉన్న అన్ని కులాలను ఆదుకునే విధంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 400డబుల్‌బెడ్ ఇళ్లు మంజూరుచేయడం జరిగిందని, వాటి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గానికి మరో వెయ్యి పడకల డబుల్‌రూమ్ గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతుల కోసం 9 గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి కృషి వల్ల రైల్వై లైన్ సాధించుకోవడం జరిగిందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడానికి రైల్వేలైన్ దోహదపడుతుందని పేర్కొన్నారు. లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామం నుండి సిహెచ్ కొండూర్‌వరకు వందకోట్ల నిధులు వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. బాసరలో 35కోట్ల నిధులతో చెక్‌డ్యాం నిర్మాణం జరుగుతుందని, దీంతో గ్రామంలో, ట్రిపుల్ ఐటి కళాశాలలో తాగునీటి సమస్య తీరుందన్నారు. బలహీనవర్గాల కుటుంబంలోని పెళ్లికాని మహిళలకు పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.51 వేలు కళ్యాణలక్ష్మి పథకం అందివ్వడం జరుగుతుందన్నారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుని బంగారు తెలంగాణ సాధించుకునేలా అడుగులు వేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిసి భవన్ నిర్మించనున్నట్టు తెలిపారు. అంబకంటి గ్రామంలో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనానికి అదనంగా వంట శాల కోసం రూ.10లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బెస్త, గూండ్ల, ముదిరాజు కులస్థులను ఆదుకోవడానికి 36కోట్ల చేపపిల్లలను ఆయా గ్రామాల్లోని చెరువుల్లో వేయించి దోహదపడ్డారన్నారు. అనంతరం ఎంపి నాగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్, డిసిఎంఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జడ్పీటిసిలు గాయత్రి, విమల, సర్పంచ్ లక్ష్మి, ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మణ్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ రమణగౌడ్, జుట్టు అశోక్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు దేవిదాస్, తాలూకా అధ్యక్షుడు మెంచు గంగారాం, డిఎస్పీ అందె రాములు, సిఐ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

దొంగలతో చేతులు కలుపుతున్న కోదండరాం
* నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం
* అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్, టిడిపి పార్టీలు
* ప్రజా సంక్షేమంలో ముందున్న ప్రభుత్వం
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12: అన్నివర్గాల ప్రజల సంక్షేమంకోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అడుగడుగునా అడ్డుకుంటున్న దొంగలతో జెఎసి చైర్మన్ కోదండరాం చేతులుకలపడం దారుణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన యాదవ శంఖారావంలో పాల్గొనేందుకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై ఎన్నో పోరాటాలుచేసి సాధించుకున్న రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకోసం కులవృత్తులపై ఆధారపడి జీవనంసాగిస్తున్నవారికి చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీముబార్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, పింఛన్ల పంపిణీ, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయడం జరుగుతోందన్నారు. వీటిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయిని మంత్రి తలసాని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరాం ఇలాంటి దొంగలతో చేతులు కలపడం సరికాదన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేందుకు కోదండరాం యత్నిస్తున్నాడని తలసాని ఆరోపించారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా లక్ష ఉద్యోగాలను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు కొత్త పరిశ్రమలు, ఐటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి నిరుద్యోగులకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనే సత్యాన్ని కోదండరాం గ్రహించాలన్నారు. మరోవైపు ముంపులేకుండా ప్రాజెక్టులను నిర్మించాలనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరి ప్రజావ్యతిరేకమన్నారు. ముంపుతక్కువగా ఉండేవిధంగా ప్రాజెక్టులను నిర్మించాలనేది కెసిఆర్ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రభుత్వ పనితీరుపై కంట్రోల్ అడిట్ జనరల్ (కాగ్) కూడా సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికి ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం సృష్టిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పనితీరుతో రానున్న రోజుల్లో ప్రతిపక్షాల ఉనికే ప్రశార్థకంగా మారిందన్నారు. తమలాంటి సీనియర్ నేతలంతా బయటికి వచ్చిన తరువాత తెలుగుదేశంపార్టీ గల్లంతుకాగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే ఎవరికి వారు ఊహించుకుంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ తిరుగులేనిశక్తిగా ఆవిర్భవించిందన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేశారనే ప్రశ్నకు మంత్రి నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈప్రక్రియ ఒకేసారి పూర్తయ్యేదికాదని, అంచలంచలుగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. యాదవులకు ఉపాధి కల్పించేందుకు గొర్రెలను పొరుగు రాష్ట్రాల నుండి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి గొడం నగేష్, జిల్లా కలెక్టర్ చంపాలాల్, డిసిసిబి చైర్మన్ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.