అదిలాబాద్

ఆ‘్ధరే’.. ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 13: రేషన్ లబ్దిదారులకు ఆధార్ సంఖ్య తప్పనిసరిగా కానుంది. చౌకధరల దుకాణాల నుంచి రేషన్ పొందుతున్న ప్రతీ లబ్దిదారుడు ఆధార్‌ను అనుసంధానించుకోవాలని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఏడాది జూన్ చివరిలోగా ఆధార్ సంఖ్య సమర్పించనివారికి రాయితీ సరకులు ఎట్టిపరిస్థితుల్లోనూ రేషన్ సరుకులు ఇచ్చేదిలేదని తేల్చిచెప్పింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.22లక్షల తెలు పు రేషన్‌కార్డుదారులు ఉండగా, లక్షా 10వేల అంత్యోదయ అన్నయోజన లబ్దిదారులున్నారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డులతో చాలామటుడు ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని మండలాల్లో ఆధార్ అనుసంధానం 95 శాతం వరకు జరగడంతో రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఇంకా కొంతమంది లబ్దిదారులు ఆధార్ సంఖ్యలను అనుసంధానించాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో ప్రజాపంపిణీలోనూ నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. అయితే అవినీతి డీలర్ల ఆటకట్టించేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపపడుతుందని అధికారులంటున్నారు. జిల్లాలో చాలాచోట్ల రాయితీ సరకులను పక్కదారిపట్టిస్తున్నారు. బియ్యం, కిరోసిన్ అయితే యధేచ్చగా పట్టుబడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో రాయితీ సరకుల క్రయవిక్రయాలు కొనసాగడం గమనార్హం. దీని వల్ల అటు ప్రభుత్వానికి ఇటు లబ్దిదారులకు అన్యాయం జరుగుతోంది. నగదు బదిలీ కార్యక్రమం ప్రవేశపెడితే లబ్దిదారుడు పూర్తి డబ్బులు వెచ్చించి సరకులు కొనుగోలు చేయాలి. తర్వాత లబ్దిదారుడి ఖాతాలో రాయితీ డబ్బులను ప్రభుత్వం జమచేస్తుంది. దీనివల్ల అవినీతి తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక వేళ డీలర్ సరుకులు అక్రమంగా విక్రయించుకున్నప్పటికీ పూర్తి ధరను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా విక్రయించిన లబ్దిదారుడి వివరాలు సమర్పించాల్సి ఉండడంతో లబ్దిదారుడు సరుకులు తీసుకోకున్నా ఆయన ఖాతాల్లో రాయితీ డబ్బులు వచ్చి చేరుతాయి. దీనివల్ల సంబంధిత రేషన్ డీలర్‌ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది.
అనుసంధానం ఎందుకంటే
రేషన్ సరకుల పంపిణీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టడానికి కేంద్రప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రతి లబ్దిదారుడికి ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టనుంది. గతంలో రాయితీ వంట గ్యాస్ వినియోగంలోకూడా అవినీతి జరుగుతున్నట్లు గుర్తించి, ముందుగా రాయితీ వంటగ్యాస్ లబ్దిదారులను ఆధార్‌తో అనుసంధానించింది. తర్వాత వారి బ్యాంకు ఖాతా నెంబర్లకు కూడా ఆధార్ అనుసంధానం చేశారు. అనంతరం నగదు బదిలీ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వినియోగదారుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేస్తున్నారు. దీని వల్ల రాయితీ వంట గ్యాస్ పక్కదారి పట్టడం తగ్గింది. అదేతరహాలో రేషన్ లబ్దిదారులను ఆధార్‌తో అనుసంధానించిన తర్వాత ప్రజా పంపిణీలోనూ నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు.