అదిలాబాద్

పసుపు రైతులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్, ఫిబ్రవరి 13: రైతులు కష్టపడి పండించే పసుపు రైతులకు అండగా ఉంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆమె సీజన్ పసుపు కొనుగోళ్లను ప్రారంభించారు. మార్కెట్ కమిటి ఛైర్మెన్ సక్కారాం శ్రీనివాస్ కృషితో 20 ఏళ్లక్రితం మూతపడ్డ పసుపు కొనుగోళ్లు సోమవారం నుండి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పసుపు రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభించే విధంగా వారికి తూకంలోగాని, డబ్బులు చెల్లించడంలోగాని ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తామన్నారు. ఈ ఏడాది రైతుల సౌకర్యం కోసం కందుల కొనుగోళ్లను కూడా నిర్వహించామని, ఈరోజు వరకు 1600క్వింటాళ్ల కందులను ఖానాపూర్ యార్డులో కొనుగోలుచేయడం జరిగిందన్నారు. అయితే పసు పు కొనుగోళ్లకు సహకరిస్తున్న మెట్‌పల్లి మార్కెట్ ఛైర్మెన్ సురేష్, మాజీ ఛైర్మెన్ విష్ణు మార్కెట్ యార్డు ట్రేడర్లను ఎమ్మెల్యే అభినందించారు. పసుపు కొనుగోళ్లతో మార్కెట్ యార్డు లో పూర్వవైభవం సంతరించేలా పాలకవర్గం సమష్టి కృషిచేయాలన్నారు. రైతులకు మార్కెట్‌యార్డులో కనీస సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే అతి తక్కువ ధరకు భోజనం కూడా సమకూర్చాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం మెట్‌పల్లి మార్కెట్‌ఛైర్మెన్‌ను, ఆప్రాంత ట్రేడర్లను ఖానాపూర్ మార్కెట్ ఛైర్మెన్ పాలకవర్గ సభ్యులతో ఘనంగా సన్మానించారు. కాగా, పసుపు పండించిన రైతులు పంటను బాగా ఎండించి చెత్తాచెదారం లేకుం డా నాణ్యంగా తెస్తే నిజామాబాద్ కంటే స్వల్ప తేడా ధరతో ఇక్కడే కొనుగోలుచేయడం జరుగుతుందని రైతు లు అందుకు సహకరించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి టి.శ్రీనివాస్ తెలిపారు. మంచి పసుపుకు ధర రూ. 8వేల వరకు చెల్లించే అవకాశముందన్నారు. బి-గ్రేడ్‌కు రూ.6వేలకు మించి ధర పలకదన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఆకుల శోభారాణి, జడ్పీటిసి సునీత, ఆత్మ చైర్మన్ రాజారెడ్డి, సత్తనపల్లి సహకార సంఘం ఛైర్మెన్ ఆమంద శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మెన్ గోపిడి రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు అశోక్‌రావు, జన్నారపు శంకర్, ఎడిఎ అనీఫ్ ఇబ్రహీం, మార్కెట్ కార్యదర్శి ఇర్ఫాన్, ఎఈవో ఆసం రవి, నాయకులు గజేంధర్, పుప్పాల శంకర్, నజీర్, ఇర్ఫాన్, షేక్ షకీల్, ఎమ్మెల్యే పిఆర్‌వో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సందర్శనతో సమస్యల పరిష్కారం
* జిల్లా అదనపు ఎస్పీ పనసారెడ్డి
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 13: పోలీసులు గ్రామ సందర్శన ద్వారా సమస్యలు తెలుసుకుంటేనే సత్వర పరిష్కారానికి వీలుకల్గుతుందని జిల్లా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ అధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి 8 మంది ఫిర్యాదుదారులు హాజరై ఆర్జీలను అందజేసి, వారి సమస్యలను నేరుగా విన్నవించారు. వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం జిల్లా అదనపు ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌ద్వారా సమస్యల పరిష్కారానికి సూచనలు అందించారు. ఈ సంధర్భంగా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిర్వహించే విధులకు రోజువారి ఆర్జీలే మార్గనిర్ధేశాలని అన్నారు. పోలీసు స్టేషన్‌లో వచ్చే ఆర్జీల ద్వారానే ప్రజా సమస్యలను గుర్తించగలమని అన్నారు. పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులను త్వరగా పరిష్కరించి, పెండింగ్‌లో లేకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రివేళల్లో నేరాలను నియంత్రించుటకు గస్తీతో పాటు పెట్రోలింగ్ పెంచాలని అన్నారు. డి ఎస్పీలు, సి ఐలు, ఎస్సైలు 6గామాలను సందర్శించి ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, ఏదైని సమస్యలుంటే వెంటనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళల సమస్యలను పరిష్కరించే సమయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని అన్నారు. సమాచారం అందిన వెంటనే క్షణం అలస్యం చేయకుండా సంఘటన స్థలంలో పోలీసులు చేరుకొని, పూర్తి ఆధారాలు సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజి చౌహన్, ఎన్‌ఐబి కార్యాలయం అధికారులు గినె్నల సత్యనారాయణ, బొమ్మకంటి సంతోష్, కంది నవీన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, జి.రామన్న, సిసిఎం పోతరాజు, పోలీసు కార్యాలయం అధికారులు జె.పుష్పరాజ్, ఆర్.్భరతి, పి.పద్మ, మురళీమోహన్, వెంకట రమణ, కిష్టారెడ్డి, రిజ్వాన్‌బేగం, అయ్యూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.