అదిలాబాద్

శివరాత్రి స్నానాల్లో మృత్యుఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 24: శివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ సమీపంలోని గోదావరిలో స్నానాలు చేస్తున్న సందర్బంలో యువకులు గల్లంతు అవ్వడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం శివరాత్రి కావడంతో హాజీపూర్ మండలం ముల్కల్ల పుష్కరఘాట్ వద్ద ఆరుగురు యువకులు నీటిలో దిగారు. గోదావరిలో స్నానం చేసేందుకు మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు వచ్చారు. స్నానాలు చేస్తున్న క్రమంలో మంచిర్యాల జాఫర్‌నగర్‌కు చెందిన పానుగంటి శ్రీకాంత్ (28) అనే యువకుడు గోదావరిలో పడి మృతిచెందాడు. మరో ముగ్గురు రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన చిట్ల చంద్రవౌళి, ఆనందపు సాయితేజ మంచిర్యాలకు చెందిన పోతుల సుధాకర్ గల్లంతయినట్లుగా గుర్తించారు. వివరాలోకి వెళ్లితే పానుగంటి శ్రీకాంత్, పోతుల సుధాకర్, ఆనందపు సాయికుమార్, నిరంజన్, శైలేందర్, వేణు లు మిత్రులతోకలిసి గోదావరి స్నానం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఇసుకలో చిక్కుకుపోయి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పానుగంటి శ్రీకాంత్, సుధాకర్‌లు కొట్టుకుపోయారు. మిగిలిన మిత్రులందరూ ప్రవాహాన్ని గ్రహించి ఒడ్డుకుచేరుకోని మిత్రులను రక్షించుదామని ఎంత ప్రయత్నించిన వారి ఆచూకీ లభించకపోవడంతో స్థానికులకు, హాజీపూర్ ఎస్సైకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై తహాసీనోద్దీన్ రెస్క్యూ టీం, గజఈతగాళ్లతో శ్రీకాంత్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబీలకు అప్పజెప్పారు. శుక్రవారం రాత్రి వరకు రెస్క్యూ టీం గాలించిన గల్లంతైనవారి ఆచూకీ తెలియరాలేదు. మరో వైపు, అదే సమయంలో మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని శాంతినగర్‌కు చెందిన ఆనందపు సాయి తేజ (19) భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన చిట్ల చంద్రవౌళి (28) కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వీరి తల్లిదండ్రులు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చిన ఏమాత్రం వారి ఆచూకీ తెలియకపోవడంతో గోదావరి వద్దనే ఎదురుచూస్తున్నారు.
పెద్ద ఎత్తున్న గాలింపు చర్యలు....
యువకులు గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న ఎస్సై తహాసీనోద్దీన్, తహశీల్దార్ మోహన్ రెడ్డి, సింగరేణి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగగా సాయంత్రం ఆరు గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. గాలింపు చర్యలు మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించి కుటుంబీకులను ఓదార్చారు. అనంతరం అధికారులతో మాట్లాడి శనివారం ఉదయానికల్లా యువకుల ఆచూకీ తెలియపరచాలని అధికారులను ఆదేశించారు.

గడువులోగా పెన్‌గంగా సాగుజలాలు అనుమానమే..?
* చెనాకకోర్ట బ్యారేజి పనులపై మంత్రి రామన్న అగ్రహం
* పంప్‌హౌస్ నిర్మాణం సత్వరమే పూర్తిచేయాలని ఆదేశాలు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24: మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకున్న పెన్‌గంగా సాగుజలాలు వచ్చే మే నెలలోగా రైతులకు అందించడం కష్టసాధ్యమేనని, పనులు నత్తనడకన సాగడంపై మంత్రి జోగురామన్న అగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి జోగురామన్న జైనథ్ మండలం చెనాకకోర్ట వద్ద నిర్మిస్తున్న బ్యారేజి పనులను, పంప్‌హౌస్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంధర్భంగా చెనాకకోర్ట వద్ద చేపట్టిన బ్యారేజి నిర్మాణంలో భాగంగా బండరాయిని బ్లాస్టింగ్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఇరిగేషన్ ఏ ఈ, ఎస్ ఈలపై అగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా మార్చి నెలలోగా రైతులకు నీరందిస్తామని చెప్పిన అధికారులు పనుల జాప్యంపై కాంట్రాక్టర్‌ను ఎందుకు నిలదీయడం లేదని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్‌గంగా జలాలు గడవులోగా రైతులకు అందించకపోతే ఇందుకు అధికారులే బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు. రూ.368 కోట్లతో చేపట్టిన బ్యారేజి నిర్మాణ పనులు సత్వరమే పూర్తిచేయాలని, పంప్‌హౌస్ నిర్మాణంలో విపరీతమైన జాప్యం సాగించడం పట్ల మంత్రి రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. చెనాకకోర్ట వద్ద పంప్‌హౌస్ నిర్మాణంలో భాగంగా 11 రాడ్‌ఫిల్లర్లు నిర్మించారని, ఇంకా 12 ఎప్పుడు మొదలుపెడుతారని ప్రశ్నించారు. బ్యారేజి నిర్మాణంలో భాగంగా బురద పేరుకపోతుందని, అందుకే కాస్త జాప్యం జరుగుతోందని, బండరాయి బ్లాస్టింగ్‌లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. కాంట్రాక్టర్ అంగీకరించిన గడవులోగా పనులు పూర్తిచేయాలని, తానుమాత్రం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. గేట్ల నిర్మాణం కూడా సత్వరమే పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పనులు పర్యవేక్షిస్తూ పెన్‌గంగా బ్యారేజి పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. అధికారులు పనితీరు మార్చుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి రామన్న వెంట టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఎస్‌ఈ షిరాజ్, ఏఈ రమణ రెడ్డి, నాయకులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.