అదిలాబాద్

శివన్నామ స్మరణంతో మార్మోగిన చికిలీనదీ తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, ఫిబ్రవరి 24: మండలంలో గురువారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా మండల కేంద్రంలోని శివాలయ ప్రాంగణంతోపాటు చికిలీనదీ తీరం శివ నామస్మరణంతో మార్మోగింది. అదేవిదంగా జాతర సందర్భంగా వాంకిడి మండల కేంద్రం జన సందోహంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తెల్లవారు జాము నుండే భక్తుల తాకిడితో శివాలయం కిటకిటలాడింది.దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ సతీ సమేతంగా వాంకిడి శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులను ఆలయ కమిటి చైర్మన్ గాదే ప్రవీన్‌కుమార్,రామగిరి పురుషోత్తం,జమాల్‌పూరి సుధాకర్,గాదే శివుకుమార్,లక్ష్మినారాయణ,అశోక్,మనోహార్, ఎర్మి శ్రీనివాసులు ఘనంగా స్వాగతం పలికారు. వీరితోపాటు వాంకిడి జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు,వాంకిడి ఎంపిపి దుర్గం ఆర్తిక,సర్పంచ్ విమలాబాయి.మండల తెరాస నాయకులు ఉన్నారు.ఇదిలా ఉండగా సాయంత్రం నిర్వహించిన శివపార్వతుల రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి మండల ప్రజలు పోటీపడ్డారు. ఈ సంధర్భంగా మండలంలోని చుట్టుపక్కల మండలాలకు చెందిన భక్తులతోపాటు మహారాష్టక్రు చెందిన వేలాధి మంది భక్తులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో మారుమ్రోగిన బాసర
బాసర, ఫిబ్రవరి 24: బాసర క్షేత్రం శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ,మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారుజామున భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు పూజలుచేశారు. స్థానిక సూర్యేశ్వర ఆయలంలో అభిషేక అర్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ప్రాంగణంలో వేద పండితులు,అర్చకులు మహాలింగార్చన పూజలు వేడుకగా నిర్వహించారు. ఈపూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరిచంకుని వ్యాసేశ్వర, గోదావరి తీరాన గల సూర్యేశ్వర ఆలయంలో నిశీకాల, లింగోద్భావ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రదాన అర్చకులు సంజీవ్‌పూజారి పేర్కొన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.