అదిలాబాద్

కాంగ్రెస్‌తోనే ప్రజా సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జన ఆవేధన సమ్మెళనం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు కేసిఆర్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. నరేంద్రమోదీ అవినీతిని అంతం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి దేశప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. పెద్దనోట్ల రద్దుద్వారా కార్పోరేట్ వ్యాపారానికి తెరలేపిన కేంద్ర ప్రభుత్వం వారికి లబ్ది చేకూర్చిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమలాకర్ రావు, కొత్త సత్తయ్య, హేమలత, సురేఖ, అత్రం సక్కు, బాకం నగేష్, ప్రసాంత్, శ్రీపతి మల్లేష్, రౌతు రజిత, తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

చంద్రవౌళి మృతదేహం లభ్యం
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 26: గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లిన మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన చంద్రవౌలి మృతదేహాన్ని ఆదివారం ఉదయం కనుగొన్నట్లు హాజీపూర్ ఎస్సై తహాసీనోద్దీన్ తెలిపారు.శివరాత్రి పురస్కరించుకోని తల్లిదండ్రులతో పుణ్యస్నానానికి వచ్చిన చంద్రవౌళి ఆకస్మాత్తు నీటి ప్రవాహం ఎక్కువై గోదావరి నీటిలో మునిగిపోయాడని రెండు రోజులుగా గాలింపు చేపట్టగా ఆదివారం ఉదయం మృతదేహాన్ని గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. హాజీపూర్ తహశీల్దార్ మెహన్ రెడ్డి, సింగరేణి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు.