అదిలాబాద్

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్, ఫిబ్రవరి 26: అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిరంతరం కృషిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు. నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో ఆదివారం సిసీ రోడ్డుపనులు, వోడ్డెర కాలనీలో నీటి ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పా టుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి శుద్ధమైన శ్రీరాంసాగర్ తాగునీటిని అందించనున్నామన్నారు. విద్య, వైద్యం, రోడ్లు తదితర అవసరాలకు ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు. ఎల్లపెల్లిలో దశలవారీగా వౌళిక వసతులన్నింటిని కల్పిస్తున్నామన్నారు. సర్పంచి భీంరావ్ వినతి మేరకు వోడ్డెర కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి అల్లోల సుమతి, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్‌లు దేవేంధర్ రెడ్డి, రాజ్‌మహ్మద్, ఎంపిటిసి సభ్యులు మహేశ్వర్ రెడ్డి, నాయకులు మురళీధర్ రెడ్డి, గౌతం రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మోహినోద్దిన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నరేశ్, సోన్, జాఫ్రాపూర్ సర్పంచులు కృష్ణప్రసాద్ రెడ్డి, సాయరెడ్డి, ఎంపిడివో గజ్జారాం తదితరులు పాల్గొన్నారు.

కాల్వలు ఇలా.. నీరు వచ్చేది ఎలా?
* కోట్లు ఖర్చుచేసినా శూన్యం
* ఏళ్ళు గడుస్తున్నా స్పందించని అధికారులు
* నీళ్ళురాక బీడుగా భూములు
వాంకిడి, ఫిబ్రవరి 26: కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బంబార చెరువు నుండి కిందికి గల ఆయకట్టు భూములకు చుక్కనీరు అందడం లేద ని దీంతో మా భూములు భీడుభూములుగా మారుతున్నాయని బంబార, ఖైరిట్, గోండ్‌కొసార, బనార్‌కొసార, రంజన్‌వీర గ్రామాల రైతులు వాపోతున్నారు. బంబార చెరువు ప్రధాన కాల్వ అరకొర నిర్మాణంతో నీరు పైకి ఎక్కకపోవడంతో చెరువులో నీరున్న కాల్వలో మాత్రం చుక్కనీరులేదంటున్నారు. కాల్వల ఏటవాలుగా లేకపోవడతో ప్రధాన కాల్వగుండా నీరుపారడంలేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. 2010లో చెరువు నిర్మాణంతోపాటు ప్రధాన కాల్వతోపాటు ఇతర కాల్వల నిర్మాణం చేపట్టారు. కాల్వల నిర్మా ణం పై అప్పటి మైనర్ ఇరిగేషన్ అధికారులు శ్రద్దచూపకపోవడంతో కోట్ల రూపాయలతో చెరువు నిర్మించినా తమకు చుక్కనీరు అందడంలేదంటున్నారు. దీని కోసం దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఆ చెరువు రైతులకు ఏమాత్రం ఉపయోగపడడంలేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. చెరువుకింద ఉన్న ఆయకట్టు రైతుల భూములకు కాల్వలు నిర్మించి రైతుల భూమిని పాడు చేశారేగాని అప్పటి నుండి ఇంతవరకు చుక్కనీరు అందలేదని వారంటున్నారు. ప్రధాన కాల్వ నిర్మాణంసరిగ్గా లేకపోవడంతో అది రైతులకు ఉపయోగపడడంలేదని, అదేవిధంగా కాల్వ నిర్మాణంలో నీటిని దాటించడానికివేసిన పైపులు పగిలి నీరంత లీక్ అవుతున్నాయని, దీంతో దిగువఉన్న పొలాలకు నీరు ఏకాలం లో కూడా అందకపోగా అటువైపుగల దారులను బురదమయం చేస్తుందని, కొసార, బంబార, ఖైరిట్ గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఈ చెరువుకింద 500 ఎకరాలు ఆయకట్టుగా డిజైన్‌చేసి దాదాపు 10కోట్ల రూపాయలతో చెరువు, దాదా పు 2.6కోట్లతో కాల్వల నిర్మాణం చేశా రు. అయితే ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదని రైతులు వాపోతున్నారు. 10కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెరువు కింద 500 ఎకరాల ఆయకట్టుని గుర్తించినా. చెరువు నిర్మించి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఏఒక్కరికి దీంతో ఉపయోగం లేదని రైతులు అంటున్నారు. చెరువు పూర్తి అయినప్పటి నుండి కాల్వలు పగిలి పోయి నీరంతా వృధా అవుతుందని అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారంటున్నారు. కాగా, బంబార చెరువు కింద నిర్మించిన కాల్వ నిర్మాణ సమయంలో కాల్వ గట్టుపై వేసిన మట్టి కుప్పలను నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తీసివేయలేదని, దీంతో వర్షం వచ్చినప్పుడల్లా తిరిగి ఆ మట్టి కాల్వలోకే పడుతుందని దాంతో నిర్మించిన కాల్వ ఇప్పటికే పై మట్టితో పూడుకొని పోయిందని వారంటున్నారు. అక్కడక్కడ మట్టి చేరి నీటిని పోకుండా ఆపుతుందని వారంటున్నారు. దీంతో దిగువనున్న పొలాలకు నీరు అందడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, నాయకులు స్పందించి కాల్వను బాగు చేయాలని కోరుతున్నారు.

మావోల బంద్ పిలుపుతో హై అలర్ట్
* ఇంటెలిజెన్స్ సమాచారంతో నిఘా ముమ్మరం
* సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల జల్లెడ

ఆదిలాబాద్, ఫిబ్రవరి 26: బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధ చర్యలను వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సోమవారం తలపెట్టిన బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్ బహుముఖ దాడికి వ్యతిరేకంగానే బంద్ పిలుపు ఇస్తున్నట్లు మావోయిస్టు అగ్రనేతలు ప్రకటన జారీచేశారు. ఈ నేపథ్యంలో చిన్న జిల్లాల ఏర్పాటు అనంతరం మావోయిస్టులు ఉనికికోసం కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్సి వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, నిఘా వ్యవస్థను ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఏజెన్సీలోని తిర్యాణి, తాండూర్, కెరమెరి, ఆసిఫాబాద్, వాంకిడి, ఇంద్రవెల్లి మండలాలతో పాటు ఉమ్మడి జిల్లా సరిహద్దులోని బేల, జైనథ్, బోథ్, కౌటాల, బెజ్జూర్, తాంసి, చెన్నూర్, కోటపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో బందోబస్తు ముమ్మరం చేసి బంద్ పిలుపు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఇరు జిల్లాల ఎస్పీలు టెలీకాన్ఫిరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. గతంలో నక్సల్స్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి అలజడి సృష్టించిన నేపథ్యంలో నక్సల్స్ కదలికలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో పాటు సరిహద్దులో కుంబింగ్ ముమ్మరం చేయాలని రెండు జిల్లాల ఎస్పీలు పోలీసు స్టేషన్ అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే బెజ్జూర్‌లో భారీ వంతెన పనులను అడ్డుకొని మావోయిస్టులు ట్రిప్పర్లను దగ్దం చేసిన సంఘటనలో చత్తీస్‌ఘడ్ నక్సల్స్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ప్రాణహిత శివారు ప్రాంతాల్లో నక్సల్స్ జిల్లాలో చొరబడకుండా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈమేరకు బజార్‌హత్నూర్ మండలం డెడ్రా అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ కల్వర్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దులో వాహనాల తనిఖీతో పాటు అక్కడక్కడా ప్రభుత్వం చేపట్టే అభివృద్ది పనులకు రక్షణ కల్పిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటూ బంద్ పిలుపు నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇంటలిజెన్సి వర్గాల నుండి అందిన సమాచారం మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మహారాష్టల్రోని చంద్రపూర్, గడ్చిరోలి, చత్తీస్‌ఘడ్‌లోని ఐరి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో నిఘా తీవ్రతరం చేయాలని పోలీసు అధికారులు సూచించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సోమవారం తలపెట్టిన బంద్ పిలుపు నేపథ్యంలో ఉమ్మడి చిన్న జిల్లాల్లో ఈసారి పోలీసు బందోబస్తు ముమ్మరం చేయడంతో పాటు ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, పోలీసులకు సమాచారం లేకుండా తిరగవద్దని జిల్లా ఎస్పీలు సూచించడం గమనార్హం.