అదిలాబాద్

వారసత్వ ఉద్యోగాలపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 5: సింగరేణి కార్మికుల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చుకునేందుకు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని తెలపడంతో కార్మికులు దరఖాస్తులు చేసుకోగా కొంత మంది కార్మికుల పిల్లలు వారసత్వ ఉద్యోగంపై కోర్టుకు వెళ్లారు. ఈ నెల 6న సింగరేణివారసత్వ ఉద్యోగంపై హై కోర్టు తీర్పు ఇచ్చేందుకు ఉండటంతో కార్మికులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సింగరేణిలో పని చేసి పదవీ విరమణ కు 11 నెలలు ఉన్న కార్మికులంతా మూడేళ్ల నుంచి మెడికల్ అన్‌ఫిట్ కోసం కొత్తగూడెం ఆసుపత్రి చుట్టు ప్రదక్షణలు చేస్తున్న ఇప్పటి వరకు ఆన్‌ఫిట్ కాకపోవడంతో ప్రభుత్వం అయిన వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తే మా కుమారులకు న్యాయం జరుగుతుందని అనుకున్న కార్మికులకు అన్యాయం జరగడంతో కార్మికుల పిల్లలో గోదావరి ఖనికి చెందిన ఓ వ్యక్తి కోర్టు ఫిటిషన్ వేయడంతో వారసత్వ ఉద్యోగాలపై తీర్పును ఇచ్చేందుకు కోర్టు వాయిదా వేసింది. దానిపైనే ఏడాదిలోపు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల కార్మికుల పిల్లలు సుమారు 8 వేల మంది సింగరేణి వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగాకుమారులు లేని వారు తమ కుమార్తెల పెళ్లిలు చేసి ఉద్యోగాలకు దరఖాస్తులు చేయించాలని అతృతతో పెండ్లి నిశ్చయించుకోని వివాహాలు చేస్తున్నారు. కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఎదురు చూస్తు ఈ నెలలో ఉన్న నాలుగు మంచి రోజులోనైన కుమార్తెల పెళ్లిలు చేసి దరఖాస్తులుచేయించాలని చూస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో వారసత్వ ఉద్యోగాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.