అదిలాబాద్

ఇష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం,మార్చి 5: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో రాణించేందుకు మార్గం సుగమం చేసుకోవాలని శిక్షణ కలెక్టర్లు గౌతమ్‌పుత్ర, అనురాగ్‌జయంత్, రాహుల్‌రాజ్, ప్రమీన్‌దీక్షా, శ్రీజలు అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను శిక్షణ కలెక్టర్లు సందర్శించిన అనంతరం విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందునా విద్యార్థులు చదువుల పట్ల ప్రత్యేకంగా శ్రద్దచూపించాలని, మారుమూల గిరిజన గ్రామాల్లోని విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో విద్యాభ్యసం చేస్తున్నందునా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలువాలని అన్నారు. విద్యార్థుల చదువుల పట్ల ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని, వారిని ఉన్నత్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు సైతం క్రమశిక్షణతో విద్యను అభ్యసించినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కవ్వాల టైగర్‌జోన్ పరిధిలోని బంగారుతాండాకు వెళ్ళి గిరిజనుల పరిస్థితుల పట్ల అడిగి తెలుసుకున్నారు. గిరిజనులతో మాట్లాడుతూ తాండాలలోని గిరిజనులు పూర్తిస్థాయిలో అక్షరాస్యత సాధించాలని అన్నారు. పిల్లలకు పనులు చెప్పకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. అనంతరం తిరిగి నిర్మల్ వెళ్ళిపోయారు. వారి వెంట మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, ఐటిడిఏ ఏపివో నాగోరావ్, మండల తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.