అదిలాబాద్

సమస్యల పరిష్కార నిలయాలుగా పోలీసు స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్,మార్చి 6: ప్రజల రక్షణకై వారి సమస్యలను న్యాయపరంగా పరిష్కరించే నిలయాలుగా పోలీసు స్టేషన్లు ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 8 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరిస్తూ ఆర్జీలు సమర్పించారు. వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం పోలీసు అధికారులతో ఎస్పీ ఎం.శ్రీనివాస్ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేవిధగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ముందుండాలని అన్నారు. గ్రామాలను సందర్శించే సమయంలో గ్రామస్తులతో స్నేహభావంతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులకు నివేదించాలన్నారు. ప్రజల మద్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములైనట్లయితే పోలీసుల పట్ల మరింత గౌరవం పెరుగుతుందన్నారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో రాత్రి సమయంలో గస్తీ నిర్వహించే పోలీసులు చురుకుగా ఉండాలని, ఎటువంటి ఆర్థిక నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజి చౌహన్, జైస్వాల్ కవిత, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్‌హఖ్, జి.రామన్న, ఎంఏ హఖీం, సిసిఎం పోతరాజ్, కార్యాలయం అధికారులు జె.పుష్పరాజ్, జె.్భరతి తదితరులు పాల్గొన్నారు.
8 నుంచి కానిస్టేబుల్ ధ్రువవపత్రాల పరిశీలన
పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్) ఉద్యోగాలకు ప్రాథమిక జాబితాలో ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు ఆదిలాబాద్ పోలీసు పరేడ్ మైదానంలో పరిశీలించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎంపికైన అభ్యర్థుల తమ నిజ ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు స్థానిక పరేడ్ మైదానంలో హాజరుకావాల్సి ఉంటుందన్నారు. నిజ ధృవపత్రాల పరిశీలన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు సమయనుసారంగా హాజరుకావాలని, అభ్యర్థులకు నిర్దేశించిన తేదీల్లో హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల సమాచార పత్రాలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో ఈనెల 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని, ధృవపత్రాల పరిశీలన, వైద్యపరీక్షలు పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పోలీ స్పెషల్ బ్రాంచ్ అధికారులతో జాబ్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా
ప్రత్యేక అధికారుల సమావేశంలో కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, మార్చి 6: బ్యాంకు అకౌంట్లు లేని వారి కోసం అన్ని మండలాల్లో బ్యాంకుమేళాలు ఏర్పాటు చేయాలని జిల్లాకలెక్టర్ చంపాలాల్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు ఉంటేనే నగదురహిత లావాదేవీలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇందుకోసం ఈనెల 21నుండి ప్రత్యేక అధికారులు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో బ్యాంకుమేళాలు నిర్వహించి, బ్యాంకు ఖాతాలు తెరిపించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఇందిరా క్రాంతి సిబ్బందితో కలిసి ఇంటింటికి వెల్లి ఖాతాలు లేని వారిని గుర్తించాలని సూచించారు. అలాగే ఆధార్ లేనివారికి ఆధార్ కార్డులు ఇప్పించే చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రత్యేక అధికారులు ఆయాశాఖల ప్రగతిని తెలుసుకునేందుకు ప్రతి గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. పనుల పురోగతికి సంభందించిన నివేదికను శనివారం తనకు అందచేయాలన్నారు. హరితహారం పథకం కోసం పెంచిన నర్సరీలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో ముఖ్యప్రణాళికాధికారి కృష్ణయ్య, జిల్లా గ్రామీణాభివృధ్ది అధికారి శంకర్, తదితరులు పాల్గొన్నారు.