అదిలాబాద్

మూతపడ్డ సిసిఐను తెరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మార్చి 6: మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని, సిసిఐ యాజమాన్యం నిరంకుశ పూరితంగా ఉద్యోగుల మెడపై కత్తిపెట్టి విఎస్‌ఎస్ నోటీసులు జారీ చేసిన వ్యవహారంపై సోమవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్‌లు కేంద్ర మంత్రిని కలిసి సిసిఐ పునరుద్దరణతో పాటు ఆకారణంగా నోటీసులు జారీ చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా సిసిఐ యాజమాన్యం స్వచ్చంద పదవీ విరమణ పథకం పేరిట ఉద్యోగులను తొలగించేందుకు కుట్రలు పన్నిందని, ఈ విషయమై హైకోర్టు డివిజన్ బేంచ్‌లో కేసు కొనసాగుతుందని తెలిపారు. కార్మిక శాఖ అనుమతి లేకుండానే ఉద్యోగులకు విఎస్‌ఎస్ పేరిట నోటీసులు జారీ చేయడాన్ని వారు కేంద్రమంత్రికి వివరించారు. ఈవిషయమై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించి ఆదిలాబాద్ సిమెంట్ ప్యాక్టరీ పునరుద్దరణ, నోటీసుల వ్యవహారంపై సత్వరమే అధ్యయనం చేసి తనకు నివేదిక సమర్పించాలని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటి కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు పాయల శంకర్, ఎస్ విలాస్‌లు పేర్కొన్నారు.