అదిలాబాద్

మందమర్రి ఏరియాలో 62% ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, ఏప్రిల్ 1: మందమర్రి ఏరియా గనులు 62శాతం ఉత్పత్తి సాదించడం జరిగిందని ఏరియా జియం వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జి యం చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్దిక సంవత్సరంలో27లక్షల టన్నులకు గాను 16లక్షల 73వేల 221టన్నులు ఉత్పత్తి సాదించడం జరిగిందన్నారు. ఏరియాలోని 5గనులలో 3గనులు పురోగతిలో నుండగా 2గనులు ఉత్పత్తిలో వెనుక పడ్డాయని దీని వల్ల ఏరియా గత సంవత్సరం కంటే ఉత్పత్తిలో మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థ 60లక్షల మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని సాదించి చరిత్ర సృష్టించడం జరిగిందన్నారు.
దేశంలోనే 15శాతం వృద్ది రేటు సాధించి ఎం సి ఎల్ తరువాత సింగరేణి సంస్థరెండవ స్థానంలో నిలిచిందన్నారు. సి అండ్ ఎం డి శ్రీ్ధర్ కృషి వల్ల అధికారులు, కార్మికులు సమిష్టిగా కృషిచేసి ఉత్పత్తి లక్ష్యాన్ని చేదించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్దిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 7నూతన కొత్త ప్రాజెక్టులు ప్రారంబం అవుతున్నాయని అందులో 3ప్రాజెక్టులు మందమర్రి ఏరియాలో ప్రారంబించడం జరుగుతుందని అన్నారు. శాంతి గని మైన్ గనిలో కన్‌టిన్య్‌స్‌మైనర్ సిష్టమ్ ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుందని అలాగే కెకె ఓసి గనికి ఎలాంటి అడ్డంకులు లేవని త్వరలో గని ప్రారంబం అవుతుందని అన్నారు. అలాగే కెకె6 కాసిపేట 2 గనులకు కూడా త్వరలో ప్రారంబించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏరియా లో భూగర్బ గనుల వల్లే నష్టాలు వస్తున్నాయని ఓసి ప్రారంబం అయితే నష్టాలను అధిగమించ వచ్చని ఆయన పేర్కొన్నారు,
ఈ ఏడాది వేసవిలో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దృష్ట్యా త్వరలో సింగరేణి ఆద్వర్యంలో కాలనీలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్ కెపి ఓసి ద్వారా వృదాగా పోతున్న నీటిని రామకృష్ణాపూర్ ప్రజలకు పంపిణి చేయడం జరుగుతుందని మందమర్రి ఏరియా ప్రజలకు కూడా గనుల ద్వారా వచ్చే నీటిని పంపిణి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కార్మికులు వచ్చే ఆర్దిక సంవత్సరంలోనైనా ఏరియాను 100శాతం ఉత్పత్తిసాధించేవిధంగా కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో డివై జియం పర్సనల్ గోవిందరాజు, కెకె ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ రాంమూర్తి, డి వై జియం సివిల్ రాజశేఖర్,పి ఓ గంగాధార్, తదితరులు పాల్గొన్నారు.