అదిలాబాద్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, మార్చి10: ప్రజాఫిర్యాదులలో వచ్చిన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషిచేయాలని నిర్మల్ ఆర్డివొ ప్రసూనాంభ రెవెన్యూ అధికారులకు కోరారు. శుక్రవారం కడెం,దస్తురాబాద్ మండల కేంద్రాల్లో గల తహసిల్దార్ కార్యాలయాలను నిర్మల్ ఆర్డీవో ప్రసూనాంబ సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈసందర్భంగా కడెం, దస్తురాబాద్ తహసిల్దార్ కార్యాలయాల్లో పలు రెవెన్యూ రికార్డుల రిజిస్టర్లను ఆమె తనిఖీ చేశారు. ఇప్పటి వరకు సాదా బైనామా, మొటేషన్ వివరాలను స్థానిక మండలాల తహశీల్దార్ నర్సయ్య, ఖలీంలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నీటి పన్నులు వసూలుచేయాలని ఆమె కోరారు. అలాగే కడెంలోని కన్నాపూర్ గ్రామ శివారులో గల సర్వేనంబర్ 266 ప్రభుత్వ భూమిలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ పథకం ఇండ్ల ఎంపిక స్థలాన్ని ఆర్డివొ ప్రసూనాంభ పరిశీలించారు. చిన్న బెల్లాల్ గ్రామంలో ల్యాండ్ యాక్టివేషన్‌ను కూడా ఆమె పర్యవేక్షించారు. ఆమె వెంట కడెం, దస్తురాబాద్ మండలాల తహశీల్దార్‌లు నర్సయ్య, ఖలీం, ఆర్‌ఐలు బాపురావు, రవీంధర్, విఆర్వోలు ఉన్నారు.

వేతన ఒప్పందంపై సమ్మెకు సిద్ధం కావాలి
శ్రీరాంపూర్ రూరల్, మార్చి 10: పదవ వేజ్ బోర్డులో సింగరేణి కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం అమలు చేయాలని కోలీండియా యజమాన్యంతో జాతీయ సంఘాలు చర్చలు జరిపినప్పటికీ కోలీండియా యజమాన్యం జాప్యం చేయడంపై సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని ఏఐటియూసి కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వేజ్ బోర్డు పరిష్కారానికి కృషి చేయకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఇప్పటికే నాలుగు సార్లు జాతీయ సంఘాలు బొగ్గు యజమాన్యాలకు మధ్య చర్చలు జరిగాయని దీనిపై ఎలాంటి పురోగతి లేకుండా వాయిదా పడ్డాయని తెలిపారు. బొగ్గు సంస్థలలో ఏనాడు 13.5 శాతం జీతాలు తీసుకున్న చరిత్ర కార్మికులకు లేదన్నారు. 9వ వేజ్ బోర్డులో యజమాన్యం, ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంభిస్తే కార్మిక వర్గం సమ్మెల ద్వారా 25 శాతం వేతన ఒప్పందాన్ని పెంచుకున్న చరిత్ర ఉందని అన్నారు. నేడు బిజేపి ప్రభుత్వం నిరకుశంగా వ్యవహరిస్తుందని 10వ వేజ్ బోర్డులో 50 శాతం వేతనాల పెంపుదల ఉండాలని డిమాండ్ చేసారు. 50 శాతం ఫెర్క్స్ రూపంలో అలెవెన్స్‌ను పెంచాలని 10 శాతం కోల్‌ఫీల్డ్ అలవెన్స్, ఎస్‌ఆర్‌ఏ ప్రతి ఉద్యోగికి పది శాతం పెంచాలన్నారు. గ్రాడ్యూటీ 20 లక్షలకు సిలీంగ్‌ను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏఐటియూసి బ్రాంచ్ కార్యదర్శులు బాజీ సైదా, ల్యాగెల శ్రీనివాస్, కొట్టే కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.