అదిలాబాద్

సింగరేణి కార్మికులకు విఆర్‌ఎస్ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, డిసెంబర్ 12: సింగరేణిలో డిపెండెంట్ కార్మికులకు విఆర్‌ఎస్ అమలు చేయాలని, లేకుంటే ఆందోళనలు తప్పవని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య హెచ్చరించారు. శనివారం రామకృష్ణాపూర్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం కొత్తగూడెంలో జరిగిన బైపార్పేట్ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో నలుగురు డైరెక్టర్లతో పాటు గుర్తింపు ప్రాతినిథ్య సంఘాలు పాల్గొని పలు అంశాలపై చర్చించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కార్మికులకు సంబంధించి రక్షణ, సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఇటీవల సింగరేణి నిర్వహించిన మెడికల్ క్యాంపులో కార్మికులకు పరీక్షలు నిర్వహించి మేలు రకమైన మందులు ఇవ్వకుండా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులనే ఇవ్వడం జరిగిందని, దీనివల్ల కార్మికులు అసంతృప్తికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు నిర్వహించినపుడు కార్మికుల కుటుంబాలతో పాటు పదవీ విరమణ పొందిన కార్మిక కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించాలనికోరడం జరిగిందన్నారు. ఆస్పత్రుల్లో అన్నిరకాల స్పెషలిస్టులను ఏర్పాటు చేయడమే కాకుండా, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బందిని నియమించాలని, లేకుంటే అన్ని వార్డులు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గనుల వద్ద క్యాంటీన్లను లక్షల రూపాయలతో ఆధునీకరించినా నాణ్యత లోపించిన పదార్థాలు సరఫరా చేయడం వల్ల కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయాన్ని అధికారులు గమనించాలని కోరారు. తేదీ 6-6-1998 అగ్రిమెంట్ ప్రకారం దూర విద్య అభ్యసించే కార్మికులకు స్టడీ లీవ్ అమలు చేయాలన్నారు. కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న స్పెషల్ ఇనె్సంటివ్ స్కీంలో టింబర్‌మెన్, సపోర్ట్‌మెన్‌లకు పీస్ వర్కర్లుగా చేయాలని కోరారు. మెడికల్ బోర్డుకు అప్లై చేసుకొని కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న కార్మికులకు వెంటనే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ విషయమై యాజమాన్యం సానుకూలంగా స్పందించడం జరిగిందని, నెలలో రెండు సార్లు బోర్డు పెట్టి మెడికల్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. కోలిండియా మాదిరి 4గంటల చార్జింగ్ అలవెన్స్ సింగరేణిలో కూడా అమలు చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో మైనింగ్ సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బానుదాస్, బ్రాంచి కార్యదర్శి అక్బర్ అలీ, ఉపాద్యక్షులు లింగయ్య, సహాయ కార్యదర్శి రాదండి సాంబయ్య, నాయకులు రామడుగు లక్ష్మణ్, కిష్టయ్య, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.