అదిలాబాద్

మున్సిపల్ ఆక్రమిత భూముల వివరాలు నివేదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 11: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమంగా మున్సిపల్ భూములను అనుభవిస్తున్న కబ్జాదారుల వివరాలను వెంటనే నివేదించాలని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ లీజు, ఆక్రమిత భూములను జెసి పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో గల లీజు, ఆక్రమిత భూముల వివరాలను వెంటనే సమర్పించాలని, మున్సిపల్, రెవెన్యూశాఖ అధికారులు ఆయా భూములను పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మార్కెట్‌యార్డు సమీపంలోని రైల్వేగేటు తరువాత గల హనుమాన్ మందిర్ ప్రక్కన గల భూమిని జెపి పరిశీలించారు. అలాగే వడ్డెరకాలనీలో అసంపూర్తి నిర్మాణాలు, జిన్నింగ్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. అనంతరం జెసి కృష్ణారెడ్డి ఆర్టీసి బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణప్రాంగణంలోని హోటల్‌లో చెత్తచెదారంతో అపరిశుభ్రంగా ఉండడం పట్ల అగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టీసి మేనేజర్, హోటల్ యజమానిని జెసి మందలించారు. అలాగే మరుగుదొడ్లు ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నాయని, పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత పాటించని హోటల్‌ను సీజ్ చేస్తామని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండనట్లయితే లీజు రద్దుచేస్తామని అన్నారు. మరుగుదొడ్లను వినియోగించుకుంటున్న ప్రయాణికుల నుండి కాంట్రాక్టర్ రూ.5చొప్పున వసూలు చేస్తున్నారని జెసి దృష్టికి తీసుకురాగా, ప్రయాణీకుల నుండి రూ.2మాత్రమే వసూలు చేయాలని, బోర్టులు పెట్టి ఎక్కువ ఎందుకు వసూలు చేస్తున్నారని నిర్వాకుడిని మందలించారు. ప్రతీరోజు బస్‌స్టాండ్ ఎదురుగా గల కుమురంభీం విగ్రహం వద్ద అక్రమంగా వెలసిన దుకాణాలను తొలగించాలని, ఆ ప్రాంతంలో మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంగతయారు, మున్సిపల్ ఇంజనీర్, ఆర్టీసి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలి
* జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మంచిర్యాల, మార్చి 11: పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యాశాఖ అధికారలును అదేశించారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్‌బిహెచ్‌వి హైస్కూల్‌లో విద్యాశాఖ అధివకారలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమిక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాస్ కాఫీంగ్‌కు తావులేకుండా పదవ తరగతి పరిక్షలు నిర్వహించాలని, ఏ మాత్రం తప్పలు జరిగినా జిల్లాకు చెడ్డపేరు వస్తుందని, ఇన్వీజిలేటర్ నుంచి పై స్థాయి అధికారల వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారలు అంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రలలో టాయిలేట్స్, తాగునీరు, ప్యాన్లు, వెలుతురు, ఆరోగ్య క్విట్లు, పర్నిచర్, పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురాకుండా జాగ్రత పడాలని, ప్రశ్న, జవాబుపత్రాల సరఫరాను గట్టి పోలీస్ నిఘతో చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రవికాంత్ రావు మాట్లాడుతూ పరీక్షల సక్రమ నిర్వహణలో పరీక్షా కేంద్రల చిఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారల పాత్ర చాలా ముఖ్యమైందని పరీక్షల నిబంధనాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, ఎసిపి చెన్నయ్య, అధికారులు తదితరలు పాల్గొన్నారు.