అదిలాబాద్

రంగుల కేళీ.. హోలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 12: రంగుల హోలీ పండగను జిల్లా అంతటా ఆదివారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ ఆదివారం రావడంతో యువకులు, చిన్నారులు, ఆయా వర్గాల ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ ఎం.శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, క్యాంపు కార్యాలయాల్లో హోలీ సంబరాల్లో మునిగి తేలారు. జిల్లా పోలీసులు, ఎస్‌ఐలు, సిఐలు బ్యాండు మేళాల మధ్య భారీ ఊరేగింపుగా ఎస్పీ క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎస్పీ శ్రీనివాస్‌ను రంగులతో ముంచెత్తారు. రెండుగంటలపాటు సంబరాల్లో పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. పోలీసు కానిస్టేబుల్లు, సిబ్బందితో కలిసి ఎస్పీ స్టెప్పులేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే జిల్లా పోలీసు శాఖ అనేక సంస్కరణలను పకడ్బందీగా అమలు చేస్తోందని, ప్రజలు నిర్భయంగా పోలీసు స్టేషన్లకు వచ్చి తమ సమస్యలు విన్నవిస్తున్నారన్నారు. జిల్లా పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేయడంవల్లే ఐదు మాసాల్లో 60శాతం వైట్‌కాలర్ నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్, ఎన్‌బిడబ్ల్యుపై ఉన్న 50మంది నిందితులను పట్టుకోవడం ద్వారా నేరాలరేటును అరికట్టామన్నారు. ఈ హోలీ సంబరాల్లో అదనపు ఎస్పీ పి.పనసారెడ్డి, డిఎస్పీలు లక్ష్మీనారాయణ, చంద్రప్రభు, సిఐలు శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకటస్వామి, ఎస్‌ఐలు వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి అధ్వర్యంలో భారీ ఊరేగింపు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపి భారీ మెజారిటీ సాధించి అధికారం చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆదివారం బిజెపి కార్యకర్తలు భారీ ఎత్తున హోలీ సంబురాల్లో పాల్పంచుకున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అధ్వర్యంలో బిజెపి, బిజెవైఎం కార్యకర్తలు బ్యాండు మేళాలతో నృత్యాలుచేస్తూ రంగులు చల్లుకుంటూ పట్టణ వీధుల్లో పర్యటించారు. అనంతరం జిల్లా ఎస్పీని కలిసి రంగులు చల్లారు. ఉద్యోగ సంఘాల నేతలు, ఇన్‌చార్జి కలెక్టర్ కృష్లారెడ్డిని కలిసి సంబురాల్లో పాల్పంచుకున్నారు.
ఎమ్మెల్యే ఇంట హోరెత్తిన వేడుకలు
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఇంట హోలీ వేడుకలు హోరెత్తించాయి. హోలీ పర్వదినం రోజునే శాసన సభ్యుని జన్మదినం రావడంతో స్థానిక టేలర్ కాలనీలోని ఆయన నివాస గృహం అభిమానులతో నిండిపోయింది. వీరందరి కోలాహలం మధ్య బాపూరావు హోలీ వేడుకలు చేసుకున్నారు. బంజారా సంఘం, టిఆర్‌ఎస్ పార్టీ అధ్వర్యంలో వేర్వేరుగా బ్యాండు మేళాల మధ్య బంజారా సంప్రదాయ నృత్యాలు చేస్తూ పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఎమ్మెల్యే బాపూరావు సైతం బంజారాలతో లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ పాటలు పాడుతూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా డిప్యుటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఇచ్చోడ, బజార్ హత్నూర్, తలమడుగు, తాంసి, గుడిహత్నూర్ ఎంపిపి, జడ్పీటిసి, ఎంపిటిసి, పార్టీనేతలు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.