అదిలాబాద్

అర్జీదారుల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 13: ప్రతీ సోమవారం ఫిర్యాదులవిభాగంలో ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించిన ఆర్జీలపై సంబంధిత శాఖ అధికారులు సాధ్యసాధ్యాలను పరిశీలించి, సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అర్జీదారునికి సమాచారం అందించడంతో పాటు అప్‌లోడ్ చేయాలని అన్నారు. ప్రతీ అర్జీ వివరాలు ఆ శాఖ అధికారికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలని, ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు క్రమంతప్పకుండా హాజరుకావాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాగా ముందుగా నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 9 కాల్స్‌వచ్చాయని అన్నారు. భీంపూర్ మండలం గోమోత్రి గ్రామానికి చెందిన కొండ నర్సింలుకు నకిలీ టైటిల్ డీడ్ ఇవ్వడం లేదని, బజార్‌హత్నూర్‌కు చెందిన డి.విజయమాల తన తల్లి వంట మనిషిగా ఉపాధి కల్పించాలని విన్నవించగా, జైనథ్ మండలం తరోడబి గ్రామానికి చెందిన జ్యోతికి కొత్తరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే రిజక్ట్ చేశారని, తనకు రేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. ఇంద్రవెల్లి మండలం దొడంద గ్రామానికి చెందిన రాథోడ్ విఠ్ఠల్ తన ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందించాలని, బజార్‌హత్నూర్‌కు చెందిన మేకల కిషన్ తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలకు కూలీ వేతనం రాలేదన్నారు. బజార్‌హత్నూర్ మండలం బూతాయి తాండాకు చెందిన మోతీలాల్ రాథోడ్ తమ గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అనంతరం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జెసి కృష్ణారెడ్డి ఓపిగ్గా వారి సమస్యలు వింటూ ఫిర్యాదులు స్వీకరించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి గత వారం వరకు 184 కాల్స్ వచ్చాయని, వాటిలో 144 కాల్స్‌కు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 40 కాల్స్‌కు త్వరలో పూర్తి సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. అదే విధంగా ప్రజావాణి కార్యక్రమానికి 5066 అర్జీలు రాగా వాటిలో 3141 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివో బానోత్ శంకర్, ఆర్డీవో సూర్యనారాయణ, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, డి ఆర్‌డివో రాథోడ్ రాజేశ్వర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి
* ఎస్పీ ఎం.శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్,మార్చి 13: ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 13 మంది హాజరై వారి సమస్యలను నేరుగా ఎస్పీకి వివరిస్తూ ఆర్జీలు సమర్పించారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న అనంతరం ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌లలో అందరికి సమానత్వంతో న్యాయం చేయాలని సూచించారు. బాధితుల సమస్యలను పోలీసు అధికారులు స్వయంగా తెలుసుకోవాలన్నారు. పోలీసుస్టేషన్‌లలో బాధితులు కూర్చోడానికి కుర్చీలు అందుబాటులో ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో స్నేహభావంతో ఉండాలన్నారు. శాంతి భద్రతలకు విభాగం కల్గకుండా ముందస్తుగా గ్రామాలను పోలీసు అధికారులు తరుచూ సందర్శించాలని సూచించారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా పోలీసులు తెలుసుకోవాలన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా దర్యాప్తు వెనువుంటనే పూర్తిచేయాలన్నారు. క్రమం తప్పకుండా పెట్రోలింగ్, గస్తీ చేపట్టాలన్నారు. ఈ బీట్ సిస్టంతో పోలీసులు ఖచ్చితంగా విధులు నిర్వహించడంతో ఆర్థిక నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. వాట్సాఫ్ ఈ బీట్ సిస్టం సత్ఫలితాలిస్తుందని, పోలీసు వాట్సాఫ్‌తో జూదం, మట్కా, అక్రమ రవాణా సంబంధించిన అంశాల సమాచారాన్ని పట్టణ ప్రజలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మరింత సమాచారం అందించే విధంగా ప్రతిఒక్కరు పోలీసు వాట్సాఫ్ నెంబర్ 8333986898 తమ మోబైల్‌ఫోన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.