అదిలాబాద్

గిరిజన మహిళ అక్రమ రవాణా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, మార్చి 13: గిరిజన మహిళలను కిడ్నాప్ చేసి పరాయి రాష్ట్రంలో విక్రయిస్తున్న ముఠా సభ్యుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. బాధితురాలిని రక్షించిన పోలీసులు నిందితులను సోమవారం ఎస్పీ ఎదుట హాజరు పరిచారు. దీనికి సంభందించి వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఆసిఫాబాద్ ప్రాంతంలోని అనేక మంది అమాయక యువతులను డబ్బుల ఎరచూపి కొంత మంది ముఠాసభ్యులు పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న సంగతి విదితమే. ఈక్రమంలో ఆసిఫాబాద్ మండలంలోని బనార్‌గొందికి చెందిన ఓ గిరిజన యువతి గత నెల 16 నుండి కనిపించకుండా పోయింది. పట్టణానికి చెందిన చెక్‌పోస్టు కాలనీలో నివాసం ఉంటున్న హీనా అనే మహిళ బాధిత గిరిజన యువతికి మాయ మాటలు చెప్పి బ్రోకర్ల సహాయంతో రూ.60వేలకు గుజరాత్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తికి విక్రయించింది. అప్పటి నుండి బనార్‌గొందికి చెందిన ఈగిరిజన యువతి ఆచూకీ తెలియక పోవడంతో ఆమె తల్లి తండృలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విచారణ ప్రారంభించిన ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్ అనుమానంతో హీనాను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించాడు. దీంతో అసలు నిజం బయట పడడంతో పొరుగురాషమ్రైన చంద్రాపూర్‌లో బాధితురాలు ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పెండ్లి చేసుకుంటానని చెప్పి కొనుగోలు చేసిన శంకర్ అనే వ్యక్తి చేతిలో చిత్రహింసలకు గురవున్న ఆ గిరిజన యువతిని ఎట్టకేలకు పోలీసులు కాపాడి స్వగ్రామానికి చేరవేశారు. ఈవ్యవహారంలో ప్రధాన నిందితురాలైన హీనాతోపాటు ఆమెకు సహకరించిన సుజాత, సరిత, శారద, శ్రావణ్, దివాకర్, విమల, గోకుల్‌దాస్, మహేష్‌లను అదుపులోకి తీసుకొని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ముందు హాజరుపరిచారు. నిందితుల నుండి రూ.20వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయాన్ని సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. అలాగే ఈకేసులో పెండ్లికొడుకు శంకర్, వంకర్ సుధాకర్, రమేష్‌లను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఎవరైనా మహిళల అక్రమరవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈసమావేశంలో డిఎస్పీ భాస్కర్, ఎస్‌హెచ్‌ఓ సతీష్ పాల్గొన్నారు.

కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్యపరీక్షలు
ఆదిలాబాద్ రూరల్,మార్చి 13: ఇటీవలే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం రిమ్స్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా, టిఎస్‌పిఎస్‌పి విభాగంలో 60 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో అభ్యర్థులకు ఎముకల చికిత్స, ఈ ఎన్‌టి విభాగం, కంటి పరీక్షల శస్తచ్రికిత్సలతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా, ఎస్పీ ఎం.శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రిమ్స్ డైరెక్టర్ ఆశోక్ నేతృత్వంలో ప్రత్యేక వైద్యబృందం అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ప్రతి రోజు 60 మంది అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కేంద్రం డి ఎస్పీ కె.సీతారాములు, ఎస్సైలు పి.గంగాధర్, విష్ణుప్రకాష్, పోలీసు డాక్టర్ సి ఆర్ గంగారాం అధ్వర్యంలో అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. అభ్యర్థులకు ఇబ్బంది కల్గకుండా ముందుగా ఎస్ ఎం ఎస్, ఫోన్ ద్వారా ముందస్తుగా సమాచారం అందించి జిల్లా కేంద్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఉద్యోగ పరిశీలన అధికారి ఎస్ కె తాజోద్దిన్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజి చౌహన్, జైస్వాల్ కవిత, సిసి ఎం పోతరాజ్, ఆర్ ఎస్సై బి.పెద్దయ్య, పోలీసు కార్యాలయం అధికారులు జె.పుష్పరాజ్, ఆర్‌భారతి, బి. ఆశన్న, అయ్యూబ్‌ఖాన్, కె.పుష్ప, రిజ్వానబేగం తదితరులు పాల్గొన్నారు.

తాగిన మైకంలో భార్యపై భర్త గొడ్డలితో దాడి
బెల్లంపల్లి, మార్చి 13: మండలంలోని కన్నల గ్రామ పంచాయతీ పరిధిలోగల లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన తుంగల శాంతమ్మ అనే మహిళపై ఆమె భర్త మల్లయ్య తాగిన మైకంలో సోమవారం సాయంత్రం గొడ్డలితో దాడి చేసాడు. స్థానికుల కథనం ప్రకారం బాధితురాలు గత కొనేళ్లుగా మతిస్థిమితం లేకుండా మందులు వాడుతూ చికిత్స పోందుతుందని తెలిపారు. రెండురోజుల క్రితం భర్త మల్లయ్య మందులు కూడా తీసుకోచ్చాడని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో పడుకోని ఉన్న శాంతమ్మపై త్రాగిన మైకంలో ఇంటికి వచ్చిన మల్లయ్య ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేసారు. దీనితో శాంతమ్మ తలకు, మెడ, కాలుకు మూడు గొడ్డలి పోట్లు పడి తీవ్రంగా గాయాలపాలైంది. గమనించిన స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తాళ్లగురిజాల ఎస్సై మల్లేశంను సంప్రదించగా కన్నల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసింది. కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాధానం ఇచ్చారు.

రహదారుల ఆధునీకరణకు 118 కోట్లతో ప్రతిపాదనలు
* ఆదిలాబాద్ ఎంపి గెడం నగేష్

ఆదిలాబాద్, మార్చి 13: ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారుల ఆధునీకరణ, సర్వీసు రోడ్లు, సెంట్రల్ లైటింగ్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణానికి రూ.118 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, నిధులు మంజూరు కాగానే త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్ అన్నారు. సోమవారం సిపివో కార్యాలయంలో నేషనల్ హైవే విస్తరణ అధికారులు, కన్సల్టెంట్లు, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలతో రహదారుల అభివృద్దిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ నాలుగు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ వెళ్లే రహదారిలో అనేక మండల కేంద్రాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, గుడిహత్నూర్ కేంద్రంలో తరుచు ప్రమాదాలు చోటుచేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ముందస్తు ప్రణాళికలు రూపోందించకుండా జాతీయ రహదారులు నిర్మించడం వల్ల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక పరిష్కార మార్గాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెన్‌గంగా నుండి సోన్ గోదావరి వరకు నిర్మించిన నాలుగు లైన్ల జాతీయ రహదారిపై పలు చోట్ల స్లిప్‌రోడ్లు, సర్వీసురోడ్లు, ఫ్లై ఓవర్‌బ్రిడ్జీలు నిర్మించకపోవడం వల్ల ప్రమాదాలు జరగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు కార్యాచరణ రూపోందించాలని సూచించారు. పొరుగునే గల నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్, ఫ్లడ్‌లైట్లు, సర్వీసురోడ్లు నిర్మించడం వల్ల అక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం లేదన్నారు. అదే తరహాలో జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక వౌలిక వసతులతో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర మంత్రులకు, అధికారులకు ప్రత్యేకంగా ఇటీవలే విన్నవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎంపి నియోజకవర్గ సెంట్రల్ ప్రాజెక్టు నిధులను మంజూరు చేయించామన్నారు. ఆదిలాబాద్‌లోని మార్కెట్‌యార్డు సమీపంలోని తాంసి బస్టాండ్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సర్వే పనులు పూర్తికావడంతో పాటు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు. అదే విధంగా గణేష్ మందిర్ నుండి భోరజ్ వరకు నాలుగు అండర్ బ్రిడ్జీల వద్ద ప్రమాదాల నివారణకు ఆధునీక సౌకర్యాల కోసం రూ.6కోట్లు మంజూరయ్యాయని అన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైల్వే లైన్ల కోసం పెద్దపల్లినిజామాబాద్ లైన్‌ను ఆర్మూర్ మీదుగా గడ్‌చందూర్ వరకు 220 కిలోమీటర్ల పొడవున నిర్మించేందుకు రూ.2800 కోట్లతో బడ్జెట్‌లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో పనులు పూర్తవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రోడ్ ఫండ్ కింద పొచ్చర నుండి గన్‌పూర్ వరకు 35కోట్లు మంజూరయ్యాయని, తన ఎంపి నియోజకవర్గంలో 180 కోట్ల సెంట్రల్ రోడ్ ఫండ్ క్రింద పనులు మంజూరై చేపట్టడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల కన్వర్షన్ కింద ఆసిఫాబాద్, రాజుర, జైనథ్, బేల, కరంజి మీదుగా 90 కిలోమీటర్ల ప్రతిపాదన ఉందని తెలిపారు. ప్రధానమంత్రి క్రిషియోజన పథకం కింద జిల్లాకు 11 ప్రాజెక్టులు రానున్నాయని అన్నారు. సమావేశంలో జెసి కృష్ణారెడ్డి, ఆర్‌డీవో సూర్యనారాయణ, నేషనల్ హైవే పిడి మీర్ హీద్, కన్సల్టెంట్లు చిట్టిబాబు, ఇంజనీరు ముత్యం తితరులు పాల్గొన్నారు.