అదిలాబాద్

ఉప సర్పంచ్‌కి దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, మార్చి 17: కనె్నపల్లి మండల పరిధిలోని జజ్జెరవెల్లి పంచాయతీ పరిధిలోని దాంపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ బూర్ల మల్లేష్‌పై గ్రామస్తులు దాడి చేసారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉప సర్పంచ్ పాఠశాల స్థలాన్ని ఆక్రమించుకోని గత కొద్ది రోజుల క్రితం స్థలంలో రేకుల షెడ్ నిర్మించారు. ఇది గమనించిన గ్రామస్తులు పాఠశాల స్థలాన్ని ఎందుకు ఆక్రమించావని నిలదీయగా వారితో వాదనకు దిగాడు. గ్రామస్తులు చేసేది ఏమిలేక ఈ విషయాన్ని తహశీల్దార్ విజయానంద్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తహశీల్దార్‌కు కూడా స్పందించకపోవడంతో గ్రామస్థులు గ్రామంలో పంచాయతీ నిర్వహించి పంచాయతీకి రమ్మని పిలువగా అతనికి పంచాయతీకి రాకపోవడంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు అతని ఇంటికి వెళ్లి పంచాయతీకి ఎందుకు రాలేదని అడుగగా కోపోద్రేక్తిడైన మల్లేష్ వారిపై గొడ్డలి, కొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలవడంతో గ్రామస్తులు కోపోద్రిక్తులై మల్లేష్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని మల్లేష్‌ను 108 వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడంతో పాటు దాడిలో గాయపడిన ఐదుగురు వ్యక్తులను వేరు వేరు వాహానాలలో చికిత్స కోసం తరలించడం జరిగిందని ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్సై తెలిపారు.

అర్హులందరికి దళితబస్తీ భూములు పంపిణీ చేస్తాం
* జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి
తలమడుగు, మార్చి 17: అర్హులైన నిరుపేద దళితులందరికి దళితబస్తీ కింద మూడెకరాల భూమిని అందజేస్తామని ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ రికార్డులను, గదులను పరిశీలించారు. సిబ్బంది కొరత కారణంగా కార్యాలయంలో సిబ్బంది తక్కువగా కనపడడంతో తహసీల్దార్ అథికోద్దిన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యాలయానికి సిబ్బందిని త్వరలోనే పంపిస్తామని అన్నారు. అనంతరం దళిత బస్తీ కింద ఎంపికైన భూములను పరిశీలించేందుకు సిద్దం కాగా అధిక వర్షంతో బురదమయం కావడంతో వాహనాలు వెళ్ళలేవని సిబ్బంది తెలుపడంతో దళిత బస్తీ లబ్దిదారులతో రెవెన్యూ కార్యాలయానికి పిలిపించి వివరాలు వెల్లడించారు. లబ్దిదారులతో మాట్లాడుతూ అర్హులైన పేద దళితులందరికి మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని తెలిపారు. ఐకెపి కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపును జెసి సందర్శించారు. అక్కడే నిర్వహిస్తున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. జెసి వెంట ఎస్సీ కార్పోరేషన్ అధికారి కిషన్, ఏపిఎం దయాకర్, డాక్టర్ నిలోఫర్, రెవెన్యూ, ఐకెపి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాధిత పోలీసు కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందజేత
ఆదిలాబాద్ రూరల్, మార్చి 17: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లింగాపూర్ ఎస్సై జి.అంబేద్కర్ భార్య హారికకు యాక్సిడెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.10లక్షల విలువగల చెక్కును శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్పీ శ్రీనివాస్ అందజేశారు. గత సంవత్సరం డిసెంబర్ 27న తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా వర్దన్నపేట్ నుంచి భార్య, ఏడాది కుమారుడితో కలిసి వాహనంలో లింగాపూర్‌కు వస్తుండగా కరీంనగర్ జిల్లాలో గట్టుదుగ్గెపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై అంబేద్కర్ మృతి చెందగా, భార్య, కుమారుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఎస్పీ శ్రీనివాస్ విచారణ చేసి రాష్ట్ర పోలీసు అధికారులకు నివేదిక పంపగా ఎస్సై అంబేద్కర్ భార్య జి.హారికకు వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంతో పాటు ప్రమాదబీమా పథకం నుండి రూ.10లక్షల 5వేల చెక్కును మంజూరు చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు ఎస్పీ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించిన అనంతరం అనేక కుటుంబాలు ఇబ్బందులు పడ్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్యాలయం అధికారులు జె.పుష్పరాజ్, ఆర్.్భరతి, ఎం.ప్రసాద్, సిసి ఎం పోతరాజు, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఎస్‌కె తాజోద్దిన్, జైస్వాల్ కవిత, పోలీసు స్పెషల్ బ్రాంచ్ సిఐ బి.ప్రవీణ్, ఎస్సై అన్వర్ ఉల్ హఖ్, జి.రామన్న, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.