అదిలాబాద్

ప్రవర్తనలో మార్పు రాకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 19: పట్టణంలో వివిధకేసుల్లో ముద్దాయిగా ఉంటూ భూకబ్జాలకు పాల్పడుతున్నాడన్న సమాచారంతో మందమర్రి పట్టణానికి చెందిన దుర్గం నరేష్‌ను ఆదివారం మంచిర్యాల పోలీసులు ముందస్తుగా అరెస్టుచేసి రామగుండం కమిషనర్ దుగ్గల్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ దుగ్గల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మంచిర్యాల పట్టణంలో ఎలాంటి భూకబ్జాలకు పాల్పడిన, ఎలాంటి పోలీస్ కేసులలో ముద్దాయిగా రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి మొదటి సారిగా తనకు ఉన్న అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ అధికారిగా దుర్గం నరేష్‌పై బైండోవర్ కేసు అమలు చేశామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే నాన్ బెయిల్‌బల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఆరు నెలలపాటు సత్ప్రవర్తన కలిగిఉండేలా రూ.5 లక్షల పూచీకత్తుపై విడుదల చేయడం జరిగిందన్నారు. భూ కబ్జాలు చేస్తున్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు తమకు నివేధిక అందించాలని మంచిర్యాల పోలీసులను అదేశించారు. దుర్గం నరేష్‌పై ఎప్పటికప్పుడు నిఘా సాధించాలని పట్టణ సిఐ సుధాకర్‌కు సూచించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు
* రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి అల్లోల
* నిర్మల్‌లో ఘనంగా టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
నిర్మల్, మార్చి 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఈప్రాంత ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని, ఇందుకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అహర్నిశలు కృషిచేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్‌లోని మంత్రి నివాసంలో టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి చేతులమీదుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వి.సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలాంటివారని, అలాంటి కార్యకర్తలను పార్టీ విస్మరించదన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొందన్నారు. బడ్జెట్‌లో వెనుకబడిన కులాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులను పెంచడం వల్ల అనేక మంది నిరుపేదల పెళ్లిళ్లకు ఆర్థికంగా కలిసివస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించడంతోపాటు ప్రతీ ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకునేలా అందరిని ప్రోత్సహించాలన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 23వేల సాధారణ సభ్యత్వం, 9వేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదుచేయాలని పార్టీ కన్వీనర్లకు మంత్రి సూచించారు. వారం రోజుల్లో ఈ లక్ష్యాన్ని పూర్తిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల కన్వీనర్‌లు నవీన్‌రావు, రఘునందన్ రెడ్డి, ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవేందర్ రెడ్డి, రాజ్‌మహ్మద్, నాయకులు రాంకిషన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, హరీష్‌కుమార్, అప్పాల మహేష్, గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.