అదిలాబాద్

మిషన్ భగీరథ పనులపై సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, మార్చి 21: ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ కుమ్రం భీం జిల్లాలో సుడిగా లి పర్యటన జరిపారు. ఇంటింటికి తాగునీరిందిచే సదుద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను ఈసందర్భంగా ఆమె పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ చంపాలాల్, ఎల్‌అండ్‌టి, మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధులతోకలిసి తొలుత జైనూర్ మం డలం భూసిమెట్టలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను సందర్శించారు. అక్కడి నుండి కెరమెరి మండలంలో నిర్మాణంలో ఉన్న ఫిల్టర్‌బెడ్ పనులను సైతం పరిశీలించారు. ఈపనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆమె సంభందిత ఎజెన్సీలను ఆదేశించారు. అక్కడి నుండి కెరమెరి మండలం ధనోర, ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్ గుడాలో నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పనులను స్మిత సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణం పనులు జరుగుతున్న తీరును మ్యాప్ సహాయంతో సంభందిత అధికారులు, ఎజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్మిత సభర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈవిషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్థానికంగా తలెత్తే చిన్న చిన్న సమస్యలను కలెక్టర్ సహకారంతో పరిష్కరించుకోవాలని స్మితా సభర్వాల్ అధికారులకు సూచించారు.

ఎస్‌హెచ్‌జి గ్రూపులు రుణాలు చెల్లించేలా చూడాలి

నిర్మల్, మార్చి 21: జిల్లాలోని మహిళా స్వశక్తి సంఘాలను బలోపేతం చేసేందుకు బ్యాంకుల నుండి రుణాలు పొందిన సంఘాల నుండి రుణాలను రికవరీ చేసి ఇతర గ్రూపులకు రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డిఆర్‌డివొ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లాస్తాయి కన్సల్టేటివ్ కమిటి సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. బ్యాంకులలో ఆధార్ ఫీడింగ్, ప్రభుత్వ సంక్షేమశాఖలు, లబ్ధిదారులకు యూనిట్ మం జూరు, సబ్సిడీ తదితర అంశాలపై సమీక్షించారు. స్వశక్తి మహిళా సంఘాలు వివిధ బ్యా ంకులలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రుణాలు తిరిగి చెల్లించనట్లయితే వేరే గ్రూపులకు రుణాలు అందించినట్లయితే జిల్లాలోని మహిళా స్వశక్తి సంఘాలను బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకులలో ప్రతి ఖాతాకు ఆధార్ ఫీడింగ్ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులలో ఎటి ఎం కార్డులను ఖాతాదారులకు పంపిణీ చేయాలని సూచించారు. మండలస్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి బ్యాంకుల వారీగా పంట, ఇతర రు ణాలు మంజూరు చేయాలన్నారు. కడెం,ఖానాపూర్ మండలాల్లో రుణాలు పొందిన స్వశక్తి సంఘాల నుండి రుణాలు రికవరీ చేయాలని లేకుంటే సంబంధిత సిసిలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మైక్రో క్రెడిట్ ప్లాన్‌మేరకు ఏయే బ్యాంకులు ఎంతమందికి రుణాలు అందించాయి, మొదలగు వాటిపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా మంజూరుచేసిన లబ్ధిదారులకు రుణాలను అందించాలని, పెండింగ్‌లో ఉన్న యుసిలను వెంటనే పంపాలని బ్యాంకర్లను ఆదేశించారు. రబీలో బ్యా ంకుల వారీగా పంట రుణాలు అందించేందుకు టార్గెట్ నిర్ణయించాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, ఆర్‌బి ఐ అధికారి అనీల్‌కుమార్, ఎస్‌బి ఐ మేనేజర్ శ్రీనివాస్‌రావు, నాబార్డు డిడి ఎం ఎన్ ఎస్ పురోహిత్, ఎస్‌బిహెచ్ మేనేజర్ మృత్యుంజయ్ ప్రధాన్, డిఆర్‌డివొ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పోరేషన్ అధికారి బాలసురేంధర్, మైనార్టీ సంక్షేమ అధికారి ప్రేమ్‌కుమార్, బిసి అధికారి నర్సారెడ్డి, ఐకెపి, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.