అదిలాబాద్

ఇంట్రావిల్లేజ్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 23: జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపట్టిన ఇంట్రావిల్లేజ్ పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంట్రావిల్లేజ్ పనులు, తాగునీటి పథకాలు, బోరుబావుల పనితీరుపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన ఇంట్రావిల్లేజ్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణ పనులకు అవసరమైనంత ఇసుక అందుబాటులో ఉందని, ఇందుకు సంబంధించి వెంటనే అనుమతులు ఇవ్వాలని తహశీల్దార్‌లకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. పనిచేయని పథకాలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రతీ గ్రామంలో ఎన్ని బోర్లు ఉన్నాయి, వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయో గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. మండలాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈఈ దేవేందర్‌రెడ్డి, డిఈఈ సత్యనారాయణ, ఎఈలు పాల్గొన్నారు.

ప్రాజక్టులను అడ్డుకుంటే పుట్టగతులుండవు
* ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్
తాండూర్, మార్చి 23: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్, టిడిపి నాయకులకు పుట్టగతులుండవని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ అన్నారు. మండలంలోని ఐబిలో గురువారం నిర్వహించిన టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రార్టీ శ్రేణులనుద్ధేశించి మాట్లాడారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భారీ, మధ్యతరహా సాగునీటీ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, టిడిపి నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నరని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హాయంలో ప్రాజెక్టులు శంకుస్థాపనకు పరిమితం అయ్యయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటీ ప్రాజక్టులు పూర్తయితే కాంగ్రెస్,టిడిపిలకు మనుగడ ఉండదన్న భయంతోనే అ పార్టీల నేతలు అడ్డుకుంటున్నరని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు సీమాంధ్ర నేతలకు తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు వాగుతున్నడని ఆయన నిప్పులు చెరిగారు. రూ.36వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం పనులు జరుగుతున్నయని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. గత మూడెళ్లలో బెల్లంపల్లి నియోజక వర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఎఐటియుసి, ఐఎన్‌టియుసి నాయకుల కుట్రల వలనే హైకోర్టు ఉద్యోగాల భర్తీ సర్క్యులర్‌ను రద్దు చేసిందని ఆరోపించారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టిన బిజెపి నేతలు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో రైతులకు పంట రుణాలు ఏలా మాఫీ చేస్తున్నరని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నదన్నారు. నిర్దేశించిన సభ్యత్వ నమోదును పార్టీ శ్రేణులు ఉద్యమంలా నిర్వహించి సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ పార్టీ నాయకులతో పార్టీ సభ్యత్వం చేయించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సిలువేరు నర్సింగం, ఎంపిపి మాసాడి శ్రీదేవి, జడ్పీటీసీ సురేష్, జడ్పీ మాజీ చైర్మన్ పురుషోత్తంగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సల్వాజి మహేందర్‌రావు, ఎంపిటిసి చౌల సత్యనారాయణ, నాయకులు సాలిగామ బానయ్య, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.