అదిలాబాద్

గ్రామాల్లో విద్యుత్ వృథా అరికట్టడానికి థర్డ్ వైర్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 24: గ్రామాల్లో ఉదయం వేళల్లో వీధి దీపాలను ఆర్పకపోవడం వల్ల విద్యుత్ వృధాగా ఖర్చవుతుందని, దీనిని అరికట్టడానికి థర్డ్ వైర్లను ఏర్పాటుచేస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ ఇలంబరిది తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో గ్రామాల విద్యుత్ దీపాల నిర్వహణపై నిర్వహించిన అవగాహణ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. కరెంటు దుబారా ఖర్చుకాకుండా అరికట్టేందుకు ప్రతీ గ్రామంలో విద్యుత్ థర్డ్ లైన్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. తొలివిడతగా జిల్లాలోని 25శాతం గ్రామాలను ఎంపికచేయడం జరిగిందని, సర్పంచ్‌లు, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేసి కరెంటు వృధాకాకుండా కరెంటు బిల్లులు తగ్గే విధంగా కృషిచేయాలన్నారు. జిల్లాలో ఉపాధి పథకంకింద ప్రతీ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులు పూర్తయ్యేటట్లు చూడాలన్నారు. ఓడి ఎఫ్ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునుటకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్మల్ విద్యుత్ డిఈ ప్రమోద్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 30 వరకు విద్యుత్ వృధాను అరికట్టడానికి థర్డ్ వైర్లను ఏర్పాటుచేసి స్విచ్‌లను అమర్చనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి లూజ్ వైర్లను సరిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలివిడత 120 గ్రామపంచాయతీల పరిధిలో పనులుచేపడుతామన్నారు. గ్రామాల్లో అవగాహణ లోపం వల్ల అజాగ్రత్త వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటుచేసి అవగాహణ చేస్తామన్నారు. ఆర్ డబ్ల్యూ ఎస్‌డిఈ కట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ గ్రామంలో ఇంట్రావిల్లేజ్ పైప్‌లైన్ వేయనున్నట్లు, 400 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎతె్తైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రామపంచాయతీల్లో తీర్మాణాలుచేసి సర్పంచ్‌లు సహకరించాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి నారాయణ మాట్లాడుతూ 93 గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నులు వసూళ్లుచేసి రాష్ట్రంలో 5వస్థానంలో ఉన్నామని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నులు వసూళ్లుచేసి ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని సర్పంచ్‌లను కోరారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, పిఆర్ ఈఈ మదుసుదన్, ఎంపిడివొలు, సర్పంచ్‌లు, ఈవొపిఆర్‌డిలు పాల్గొన్నారు.