అదిలాబాద్

సమాజ సేవలో వైద్యులు భాగస్వామ్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 24: సమాజసేవలో పోలీసులే కాకుండా వైద్యులు కూడా భాగస్వామ్యులు కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. పోలీస్ మిత్ర పై వైద్యులకు అవగాహన కల్పించారు. ప్రజలకు అవసరమైనంతా సేవలను అందించటంలో పోలీసులు సరిపోకపోవచ్చునని తమ రక్షణకు తమనే భాగస్వామ్యులను చేసే దిశగా పోలీస్ మిత్రను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. యువత ఎన్‌సిసి, విద్యార్థులతో ట్రాఫిక్, రాత్రివేళలో గస్తీ విధులు కేటాయించనున్నామన్నారు. అదేవిధంగా మహిళలకు షిటీమ్‌లలో భాగస్వామ్యులు చేసేవిధంగా ప్రణాళికలు రూపోందించామని తెలిపారు. కుటుంబ సభ్యులలో వస్తున్న కలహాలను పోలీసులు పరిష్కరించే విషయంలో ఇబ్బందులు తలెత్తున్నాయని సీనియర్ సిటిజన్ సేవలను సద్వినియోగం చేసుకోనున్నట్లుగా తెలిపారు. వివిధ నైపుణ్యం కలిగిన వారిని అవసరాలకు తగట్లుగా వినియోగించుకోని ప్రజలకు సేవలందించేదిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సామాజిక సేవలు, వైద్యుల భాగస్వామ్యం కీలకమైదని ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటన వద్దకు వైద్యులే వెళ్లే సేవ చేసేలా ఉండాలని తెలిపారు. పోలీసులు విధులలో వివిధ ప్రాంతాలలో ఉంటారని వారికి ప్రథమ చికిత్సపై అవగాహన తెలిపేందుకే వైద్యులు సహకారాలు అందించాలన్నారు. వైద్యులు పోలీస్ మిత్రులుగా సేవ చేసే అసక్తి ఉన్న వారు పోలీస్ స్టేషన్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న సంఘటనల వల్ల వైద్యులకు, ప్రజలకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయని వైద్యులు తప్పనిసరిగా ఆసుపత్రి ఆవరణలో సిసి కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల డిసిపి జాన్‌వెస్లీ, ఎసిపిలు చెన్నయ్య, సతీష్, కవిత, మంచిర్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుఖభోగి వెంకటేశ్వర్ రావు, జిల్లా వైద్యాధికారి భీష్మా, వైద్య బృందం పాల్గొన్నారు.