అదిలాబాద్

నూతన చట్టాలతోనే కేసుల దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 25: బాధితులకు న్యాయస్థానాల్లో సత్వరం న్యాయం జరగాలంటే నిందితులపై నేరారోపణలు రుజువు చేసే బాధ్యత పోలీసు అధికారులపై ఉందని, ఇందుకు పోలీసు అధికారులు నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉన్నట్లయితే కేసుల దర్యాప్తు సులభతరం అవుతుందని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి.వైజయంతి అన్నారు. శనివారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నూతన చట్టాలపై జరిగిన వర్క్‌షాప్‌నకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె న్యాయ, పోలీసు అధికారులనుద్దేశించి మాట్లాడుతూ సాధారణంగా పోలీసు అధికారులతో భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) కేసుల్లో సులువగా పరిశోధన చేసే అవకాశం ఉండేందన్నారు. మారుతున్నకాలంలో కొత్తగా వచ్చిన చట్టాలపై పోలీసు అధికారులు అవగాహనలోపంతో సరైన పరిశోధన జరపడంలో ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో కేసులను న్యాయస్థానాల్లో రుజువు చేయలేక పోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతుందని, ప్రత్యేక చట్టాల్లోని ముఖ్యమైన పద్దతులను పాటించకపోవడం వలన పోలీసు కేసులు న్యాయస్థానాల్లో నిలవలేకపోతున్నాయన్నారు. చట్టంలోని అంశాలపై సరైన అవగాహణ లేకపోవడం, చట్టాలను ఖచ్చితంగా అమలు చేయకపోవడంతో జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతి 4వ శనివారం అన్ని జిల్లాల కేంద్రన్యాయస్థానాల్లో వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పరిశోధనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని, నిందితులకు శిక్షపడే విధంగా పకడ్బందీగా దర్యాప్తు చేయాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి నెల నిర్వహించే నేర సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు నూతన చట్టాలపై అవగాహణ కల్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాసీక్యూషన్ నిపుణులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసు అధికారులు మరింత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పోలీసు అధికారులకు సైబర్ నేరాల్లో దర్యాప్తు సామార్థ్యం పెంచే విధంగా కృషి చేయాలని డైరెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసీక్యూషన్ అధికారులకు దర్యాప్తులోని ముఖ్య అంశాలైన నేర పరిశోధన, సొత్తు స్వాధీనం, నేరస్థులను పరిశోదించడం, జప్తు, అటాచ్‌మెంట్ ఇతర అధీనంలో ఉన్న దస్తావేజులను ఏలా గుర్తించడం, నోటీసులు జారీ చేసి సాక్షులుగా సేకరించవచ్చో అనే తదితర అంశాలపై మెలకువలను కొత్తగూడెం జిల్లా అదనపు ప్రాసీక్యూషన్ నిపుణుడు ఫణికుమార్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దేవెందర్, జిల్లా కోర్టు ప్రాసీక్యూషన్ నిపుణులు ఎం.రమణారెడ్డి, సి.మృత్యంజయ, కె.శ్రీరాం, మల్లికార్జున, డిఎస్పీలు లక్ష్మీనారాయణ, సీతారాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, పట్టణ సిఐలు ఎన్.సత్యనారాయణ, పోతారం శ్రీనివాస్, గణపత్ జాదవ్, ఉమ్మడి జిల్లాల పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.